News

కమ్యూనిస్టుల విలాస జీవితాన్ని బయటపెట్టిన కమ్యూనిస్టు నేత కుమారుడు..

34views

వామపక్ష నేతలు అనగానే అత్యంత సాధారణ జీవన శైలి, సాధారణ వస్త్ర ధారణ, నిత్యం నిరుపేద ప్రజల గురించే ఆలోచించడం, సైకిల్ పై తిరగడం.. ఇవన్నీ మన మనస్సులో గిర్రుమని తిరుగుతాయి కదా. ఇదంతా ఒఠ్ఠిదే. ఈ భ్రమల్లో ప్రజలను వుంచి, వారు మాత్రం అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటారు.ఇది చెప్పిందో ఎవరో కాదు.. కేరళకి చెందిన కమ్యూనిస్టు నేత పన్యన్ రవీంద్రన్ కుమారుడు, న్యాయవాది పన్యన్ రూపేశ్ అసలు విషయాన్ని బయటపెట్టేశాడు. కమ్యూనిస్టుల జీవన శైలిపై సోషల్ మీడియాలో ఏకిపారేశాడు.ఇప్పుడు ఈ పోస్ట్ అందర్నీ ఆకర్షిస్తోంది.

ఇప్పుడు, సీనియర్ వామపక్ష నాయకుల కుటుంబాల నుండి కూడా విమర్శలు రావడం కూడా ప్రారంభమయ్యాయి. కమ్యూనిస్టు లాంటి పార్టీలో అచ్చు కాంగ్రెస్ లాగా బంధు ప్రీతి పెరిగిపోయిందని, కమ్యూనిస్టుల కుమారులు, కుమార్తెలు పార్టీలో ఉన్నతంగా ఎదగక పోయినా… తండ్రుల పరపతులను అడ్డం పెట్టుకొని, వ్యాపారాలు పెంచుకోవడం, వ్యాపారంలో అనుకూలమైన సహాయాన్ని పొందడం, అలాగే పెద్ద పెద్ద వ్యాపార సమూహాల్లో మంచి పదవులు పొందుతున్నారని ఆ పోస్టులో వుంది.

‘‘ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో డబ్బులతో పాటు ప్రలోభాలను చూసి సామాన్యులు గురికారు. మంచి విలాసవంతమైన భవనాల్లో నిద్రించే, బీకాన్ లైట్లు, గట్టి భద్రత, విలాస వంతమైన వాహనాలలో ప్రయాణించే వారు పేదల కన్నీళ్లను విస్మరించి, మహారాజుల లాగా జీవించే నాయకుల కోసం కాలం వేచి చూడదు.పేదరిక నిర్మూలన నుంచి బయటకు తీసేస్తామని గొప్పలు చెప్పుకుంటారు. ఇళ్లు కట్టిస్తామని కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు. ఎర్ర జెండాలతో తిరగడం ద్వారా, కమ్యూనిస్టు పార్టీలో సంప్రదాయకంగా ఇచ్చే నినాదాల ద్వారా ఒకరు కమ్యూనిస్టుగా మారలేరు. నిజమైన కమ్యూనిస్టులెవ్వరూ అధికారం కోసం ఆరాటపడరు. వీఐపీలు, సాంస్కృతిక ప్రముఖులు ఇలాంటి చర్చలను ఆస్వాదించవచ్చు, కానీ అవి పేదల కడుపు నింపవు. ఈ వాస్తవాన్ని గ్రహించాలి.’’ అంటూ రూపేష్ చురకలంటించారు.

అసలు ఈ రోజుల్లో ఎవరు నిజమైన కమ్యూనిస్టులు, ఎవరు కారో ప్రజలకు స్పష్టంగా తెలుసని, తమకు కూడా తెలుసని అన్నారు. ఈ రోజుల్లో ఎవరికీ నిజమైన కమ్యూనిస్టులు అవసరమే లేదు. అయినా.. ఈ పతనం, ఎన్నికల్లో పరాభవం, అనేవి మీకు గుణపాఠం అవుతుందని అనుకుంటున్నా. అని రూపేష్ ఏకిపారేశారు