ArticlesNews

అంతర్జాతీయ మెడిసిన్‌ సదస్సులో ముఖ్యాంశంగా అశ్వగంధ..!

40views

డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్‌ ట్రెడిషన్‌ మెడిసిన్‌ సమ్మిట్‌లో అశ్వగంధ ప్రయోజనాలు చర్చనీయాంశంగా మారింది. ఆయుర్వేదంలో అత్యంత అగ్రభాగాన ఉండే మూలికల్లో ఒకటైన అశ్వగంధ ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండొవ డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్‌ ట్రెడిషనల్‌ మెడిసిన్‌ సమ్మిట్‌ 2025కి భారత్‌ వేదికగా మారింది. 

యావత్తు ప్రపంచం క్లినికల్‌ మద్దతు ఇచ్చేలా దాని ప్రామాణికత, ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది భారత్‌. అందరూ వినియోగించేలా భద్రత, నాణ్యత, చికిత్స అనువర్తనాలను హైలెట్‌ చేసింది. అయితే మిస్సీసిపీ విద్యాలయం రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఇఖ్లాస్‌ ఖాన్‌ అందరూ వినియోగించేలా చేయడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా దీనిపై శాస్త్రీయ పరిశోధనలకు పిలుపునివ్వడమే కాకుండా వినియోగించేలా చేయాలనే చర్చలకు వేదికైంది భారత్‌ .

అశ్వగంధతో కలిగే లాభాలు..

  • ఆధునిక కాలంలో అంటువ్యాధులులా మారిన ఒత్తిడి, ఆందోళనలను నివారిస్తుంది “ఆయుర్వేద మూలికల రాజు” అశ్వగంధ.
  • నిద్రలేమిని నివారిస్తుంది.
  • దీనిలో ప్రధాన ఒత్తిడి హార్మోన్‌ అయిన కార్టిసాల్‌ను నియంత్రించే సామర్థ్యం ఉందట
  • కండరాల ద్రవ్యరాశి, బలాన్ని పెంచి శారీరక పనితీరుని మెరుగుపరుస్తుంది.
  • జ్ఞాపకశక్తి మెరగవ్వుతుంది, మెదుడు ఆరోగ్యం బాగుంటుంది
  • రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
  • గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది
  • రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
  • టెస్టోస్టీరాన్‌ ఉత్పత్తిని పెంచుతుంది, ప్రోటీన్‌ సంశ్లేషణను ప్రేరేపిస్తుంది.
  • ఉపయోగించే విధానం..

  • కనీసం 60 రోజుల పాటు వినియోగిస్తే.. మంచి సత్ఫలితాలను పొందగలమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
  • ఒక గ్లాసు వెచ్చని పాలలో 1/4 నుంచి 1/2 టీస్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తీసుకుంటే మంచి పలితం ఉంటుందట
  • దీన్ని ఆవునెయ్యిలో కలిపి మాత్రల మాదిరిగా కూడా తీసుకోవచ్చట.
  • ఉయదం బ్రేక్ ఫాస్ట్ స్మూతీ లేదా ఓట్ మీల్‌కు ఈ పొడిని జోడించి తీసుకోవచ్చట.
  • వాళ్లకి మాత్రం మంచిది కాదు..

  • గర్భిణీ స్త్రీలు హార్మోన్ల సమతుల్యతకు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నందున ఈ అశ్వగంధని వినియోగించపోవడమే మేలు
  • ధైరాయిడ్‌ రుగ్మతలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి వాడటమే మంచిది.
  • ఆటోఇమ్యూన్‌ పరిస్థితులు ఉన్నవారు కూడా వైద్యులు సూచనలు మేరకు తీసుకోవడం మంచిది.
  • గమనిక: ఇది కేవలం అవగాహన మన సంప్రదాయ వైద్య విధానం గొప్పతనం తెలియజేయడం గురించే ఇచ్చాం ఈ కథనం. ఈ మూలికను వినియోగించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణును సంప్రదించడం ఉత్తమం.