News

మతవిద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే

121views

మహారాష్ట్రలోని వాషిమ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల కోసం బగ్వాన్ పురాలో జరిగిన ర్యాలీలో హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందిన AIMIM ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్అవుతోంది. అందులో అతను మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పిల్లల ఆట కాదు. మన విషయానికి వస్తే, ఇన్షా అల్లాహ్, ప్రతి వీధి కూడా ఖాళీ అవుతుంది” అంటూ మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడిన ఈ మాటలు రాజకీయాల్లో తీవ్రదుమారాన్ని రేపుతున్నాయి.

ముంబై బిజెపి మైనారిటీ ఫ్రంట్ అధ్యక్షుడు వసీం ఖాన్ ఈవ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్రలో మా సోదరభావాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు ప్రయత్నిస్తే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అని చెబుతూ “AIMIM ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ మహారాష్ట్రకు వచ్చి మతం, షరియాను సాకుగా చేసుకుని ఈ రాజకీయాలు చేస్తున్నారు. ఇది మీ హైదరాబాద్‌లో పని చేయవచ్చు, కానీ మహారాష్ట్రలో అది పనిచేయదు” అని ఖాన్ అన్నారు. అదేవిధంగా వారు మాట్లాడుతూ “హైదరాబాద్‌లో మీరు మీ యజమాని అడుగుజాడల్లో నడుస్తూ మీకు నచ్చినది చేయవచ్చు, కానీ మహారాష్ట్రలో అది పనిచేయదు. మహారాష్ట్ర మీకు గుణపాఠం నేర్పుతుంది. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అని ఖాన్ కొనసాగించాడు.

ఎప్పుడైనా సరే బహిరంగ సభ జరిగితే చాలు మతవిద్వేషాలు జరిగే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అనేది ఎంఐఎం పార్టీకి అలవాటే..ఆ పార్టీకే చెందిన అక్బర్ ఉద్దీన్ ఓవైసీ పోలీసులను 15 నిమిషాలు తొలగించు, మేము ఏమి చేయగలమో చూపిస్తామని అంటూ రెచ్చగొట్టే విధంగా ఎలా మాట్లాడారో మనకు తెలుసు. ఇక అతని సోదరుడు ఎంపీ అసొదిద్దీన్ ఓవైసీ తాజాగా ఎంపీగా ప్రమాణ స్వీకారం సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా ఆయన జై పాలస్తీనా అని నినాదాలు చేసిన సంగతి తెలిసిందే..అంతేకాదు ముంబై పేళుల్ల కేసు సమయంలోనూ యాకుబ్ మీనన్ ను ఉరితీస్తుంటే ఒక ముస్లిం కాబట్టే ఉరితీస్తున్నారంటూ ఒక ఉగ్రవాదికి సపోర్టు చేస్తూ మతవిద్వేషాలు రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారు. ఇలా ఏదో ఒక సందర్భంలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఆ అన్నదమ్ములకు, ఆ పార్టీ నాయకులకు అలవాటైపోయింది.