
ఎన్టీఆర్ జిల్లా నాగాయలంక వద్ద నిరంతరం ప్రవహిస్తున్న పవిత్ర కృష్ణానదికి భక్తులు మహా వస్త్ర సమర్పణను వేడుకగా నిర్వహించారు. సర్వ పాపహరణిగా సాగర జలాలతో కలిసి తమను నిరంతరం తరింపజేస్తున్న నదీమతల్లికి కృతజ్ఞతగా 500 చీరలను సమర్పించారు. సాయంత్రం ఐదు గంటలకు నాగాయలంక ప్రధాన కూడలి నుంచి ఫెర్రీ రోడ్డులో 2,750 మీటర్ల పొడవైన చీరల తోరణంతో మహిళలు ప్రదర్శనగా కృష్ణానది ఒడ్డుకు చేరుకున్నారు.

తొలుత అంబా సాయి కౌశిక్ శర్మ బ్రహ్మత్వంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులు కృష్ణానదికి పూజ చేసి చీర, పసుపు, కుంకుమలు సమర్పించారు. బాపట్లలోని సాయిబాబా మందిరం నుంచి 30 మంది శిష్య బృందంతో సాయిస్వామి వచ్చి చీరల సమర్పణ పూజలో పాల్గొన్నారు. చీరల తోరణాన్ని ఇవతల తూర్పు వైపు కృష్ణవేణి మాత విగ్రహం నుంచి పడవల సాయంతో అవతల దక్షిణం వైపు తీరానికి చేర్చారు. కృష్ణా–ఉమ్మడి గుంటూరు జిల్లాల అనుసంథానంగా నదిపై జరిగిన ఈ కార్యక్రమంలో అవతలివైపు మహిళలు పూజలు జరిపారు. అనంతరం నది ఒడ్డున కృష్ణవేణి మాత విగ్రహానికి వేద పండితులు విశేష పూజ జరిపి నవ హారతులు సమర్పించారు. క్షే





