
అంతర్జాతీయ గీతా ఉత్సవం 2025 సందర్భంగా నేపాల్ లోని భారత రాయబార కార్యాలయం “నేటి ప్రపంచంలో భగవద్గీత యొక్క ఔచిత్యం” అనే అంశంపై ఒక సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నేపాల్ సంస్కృత విశ్వవిద్యాలయం మరియు త్రిభువన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు గీత యొక్క వివిధ అంశాలపై ప్రసంగించారు. ఆధునిక యుగంలో గీత శాశ్వత జ్ఞానం మరియు ఔచిత్యాన్నితెలియజేశారు. త్రిభువన్ విశ్వవిద్యాలయంలోని సంస్కృత విభాగాధిపతి డాక్టర్ నారాయణ్ ప్రసాద్ గౌతమ్ మాట్లాడుతూ, కురుక్షేత్ర యుద్ధభూమిలో రాజు ధృతరాష్ట్రుడి సహాయకుడు సంజయుడికి మహాభారత దర్శనాన్ని ఇచ్చిన సంఘటనను పంచుకున్నారు.నేపాల్ సంస్కృత విశ్వవిద్యాలయంలోని వాల్మీకి క్యాంపస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రేమ్ రాజ్ న్యూపానే భగవద్గీత యొక్క కర్మ యోగం గురించి మాట్లాడారు.
నేపాల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు భగవద్గీత యొక్క ఇతివృత్తాల నుండి ప్రేరణ పొందిన సాంస్కృతిక నృత్యం, సంగీత ప్రదర్శనలను ప్రదర్శించారు. వారి ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఈ కార్యక్రమానికి సాంస్కృతిక గొప్పతనాన్ని చాటాయి.
అంతర్జాతీయ గీతా మహోత్సవ్ 2025 అనేది వారం రోజుల పాటు జరిగే పండుగ, ఇది ఈ సంవత్సరం డిసెంబర్ 1న వచ్చే గీతా జయంతి నాడు ప్రారంభమవుతుంది. ఇది ప్రధానంగా హర్యానాలోని కురుక్షేత్రంలో జరుపుకుంటారు.
కురుక్షేత్రంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి భోదించారు. భగవద్గీత ప్రారంభం నుండి హిందువులకు తాత్విక మార్గదర్శిగా, ఆధ్యాత్మిక గురువుగా ఉంది. గీతలో, శ్రీకృష్ణుడు అనేక పాఠాలు బోధించాడు.





