News

హిందువులపై జరుగుతున్న దాడులపై హోం శాఖ దృష్టి సారించాలి

353views

కృష్ణాజిల్లా పెడనలో హిందూ బంధువుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నాదెళ్ల కోటేశ్వరరావు తన అరెస్ట్ పై మీడియాతో మాట్లాడుతూ, పేలుళ్ళ నేపధ్యంలో గొడవలు చెలరేగే అవకాశం ఉందని ఉద్దేశంతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టానని, దానికే నాకు ఎటువంటి నోటీసులు ఇప్పకుండా అర్థరాత్రి పెడన పోలీసులు అరెస్టు చేశారని, ఇదే పెడనలో శివాలయంపై దాడులు చేస్తే వారి మీద ఎటువంటి చర్యలు లేవని, కక్షపూరితంగా స్థానిక పోలీసులు వ్యవహరించారన్నారు. సాక్షాత్తు జిల్లా ఎస్పీ గారి దగ్గర నుండి రక్షణ పొందానని అటువంటి వ్యక్తులపై ఎటువంటి చర్యలు లేవని, పోలీసులు పక్షపాత వైఖరిపై ఆయన తీవ్ర నిరసన తెలియజేశారు.

ఇదే విషయం పై ఆయనకు మద్దతు తెలియచేయడానికి వచ్చిన బిజెపి జిల్లా అధ్యక్షుడు మరియు హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పట్ల పోలీసుల తీరు సరిగ్గా లేకపోవడంతో వారందరూ రోడ్డుపై బైఠాయించడంతో ఒకానొక పరిస్థితిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెడనలో గోవధ జరుగుతుందని కేసులు పెడితే వారి మీద ఎటువంటి చర్యలు ఉండటం లేదని, ఫిర్యాదు చేస్తున్న హిందువులకు బేడీలు వేసి అరెస్టులు చేస్తున్నారవి, ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలపై రాష్ట్ర హోంశాఖ పెడనపై దృష్టి పెట్టాలని ఆయన తెలియజేశారు.

హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఈ విషయం గురించి మా పెద్దలు డిఎస్పీ గారితో చర్చిస్తుంటే ఆయన గట్టిగ అరుస్తూ బెదిరిస్తున్నారని, పెడన ఎస్సై, మిమ్మల్ని కొడతాము, తిడతాము, అరెస్టులు చేస్తామంటూ బెదిరిస్తున్నారని, పెడనలో ఇవే కొనసాగితే హిందూ బంధువులందరూ కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.