News

వనవాసి ప్రజల కోసం పోరాడిన మహనీయుడు భగవాన్ బిర్సా ముండా : భరత్ కుమార్

231views

వనవాసి జీవితాలలో వెలుగును నింపి బానిస సంకెళ్లు విడదీయడంలో ఎనలేని కృషి చేసిన ఘనత భగవాన్ శ్రీ బిర్సా ముండాకే దక్కుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆర్ఎస్ఎస్ మూడు రాష్ట్రాల ప్రాంతీయ ప్రచార శ్రీ భరత్ కుమార్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం మండలంలోని కన్నాపురం గ్రామంలో సౌభాగ్య కళ్యాణ మండపంలో పాలవరం నియోజకవర్గ పరిధిలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన వనవాసి కార్యక్రమానికి శ్రీ భరత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైన ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన పూర్వీకుల సంపదను గౌరవాన్ని మరియు ప్రాణాలను దోచుకున్న విదేశీ మతోన్మాద అబ్రహామిక్ మతమార్పిడే మాఫియా బ్రిటీష్ దురాక్రమణ దొరల ఉక్కు సంకెళ్ళను తెంచి గిరిజన వనవాసి ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యం కల్పించేందుకు వీరోచితంగా పోరాడిన వనవాసీ స్వాతంత్ర్య యోధుడు భగవాన్ బిర్సా ముండా అని కొనియాడారు. 150వ జయంతి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.

1875 నవంబరు 15న ఝార్ఖండ్ ప్రాంతంలోని చోటా నగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించిన బిర్సా ముండా…. స్వతహాగా తెలివితేటలున్నవాడు అని పలు భాషలలో ప్రావీణ్యం ఉండడంతో పాటుగా గణిత శాస్త్రంలో దిట్ట అని కొనియాడారు నుదుట బొట్టు, మెడలో జంధ్యం ధరించిన బిర్సా వనవాసీలు సంప్రదాయాలను విడిచిపెట్టరాదని, నైతిక వర్తన కలిగివుండాలని బోధించేవాడు అని అన్నారు. భారత దేశ స్వాతంత్ర్యం కోసం, స్వధర్మం కోసం, కన్న భూమి కోసం బలిదానం చేసిన భగవాన్ బిరసా ముండా చిరస్మరణీయుడు అని కొనియాడారు.


భగవాన్ బిర్సా ముండా 150 వ జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు దేశానికి బిర్సా ముండా లాంటి మహనీయులు ఎంతో అవసరం అని నేటి యువత ఆయన బాటలో పయనించాలని భరత్ కుమార్ జి కోరారు.

ఆర్ఎస్ఎస్ ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు భరత్ కుమార్ జి తెలియజేశారు.