News

పంజాబ్ లో ఉగ్ర కుట్న భగ్నం చేసిన పోలీసులు

149views

ఢిల్లీలో ఎర్రకోట వద్ద పేలుడు ఘటన కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది ఇదిలా ఉండగానే పంజాబ్ లో మరో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం శారు. పంజాబ్ లో గ్రనేడ్ దాడులకు ప్లాన్ చేస్తున్న పాకిస్తాన్ ఐఎస్ఐ మద్ధతు ఉన్న మాడ్యుల్ ను లూథియానా పోలీసులు ఛేదించార.

ఈకేసుకు సంబంధించి మొత్తం 10మంది నిందితులను అరెస్టు చేశారు. వారి వెనుకున్న హ్యాండర్లు, పాక్ ఐఏఎస్ కనుసన్నల్లో మలేషియాలో ఉన్నట్లు భావిస్తున్నట్లు మీడియాకు వెళ్లడించారు. మలేషియాలో ఉన్న పాక్ కు చెందిన ముగ్గురు హ్యండర్ల ద్వారా సంప్రదంపులు జరిపి హ్యండ్ గ్రనేడ్లను సేకరించడం, వాటిని డెలివరీ చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని లూథియానా సిటీ పోలీస్ కమిషనర్ స్వపన్ శర్మ తెలిపారు. రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పడానికి రద్దీ ప్రాంతాల్లో గ్రనేడ్ దాడులు చేయడం నిందితుల టార్గెట్ అని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు. వీరిని మరింతగా విచారిస్తున్నామని తెలిపారు.