
129views
నవధాన్యాల సాగుతోనే భూసారం పెరుగుతుందని అన్నమయ్య జిల్లా వ్యవసాయాధికారి జి శివనారాయణ పేర్కొన్నారు. జిల్లాలోని చిన్నఓరంపాడు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివనారాయణ మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించాలని, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఎరువులు పంట సమయంలో తగినంత వాడాలని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా సోలార్ అందిస్తుందని, రైతులు తమ పంట పొలాలకు సోలార్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అంతర పంటలైన మినుము, అలసంద , నువ్వులు, మొక్కజొన్న, సజ్జ సాగు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రీరాములు, అభ్యుదయ రైతు డాక్టర్ జి వెంకటరామరాజు, వీహెచ్‌ఏ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.





