News

హిందూ సంప్రదాయాలు సంస్కృతికి చిహ్నాలు

148views

హిందూ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచ దేఽశాలకే ఆదర్శం అని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి, జేసీ కొల్లబత్తుల కార్తీక్‌ అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో బేతంచెర్ల రోడ్డులోని నగరవనంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి వారు ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఉసిరిక చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి మొక్కలు నాటారు. అనంతరం పలు స్కూళ్ల విద్యార్థులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. జిల్లా అధికారులు ఆటల, పాటలతో ఉల్లాసంగా గడిపారు. డీఆర్‌ఓ రామునాయక్‌, జిల్లా ఫారెస్టు అధికారిణి నాగమణేశ్వరి, డోన్‌ ఫారెస్టు రేంజర్‌ ప్రవీణ్‌కుమార్‌, డోన్‌ ఆర్డీఓ నరసింహులు, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌గౌడ్‌, తహసీల్దార్‌ రవికుమార్‌, ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.