
38views
భూసేకరణలో భాగంగా మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీలో కూల్చివేసిన మసీదును పునర్నిర్మించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భూసేకరణ పరిధిలోకి రావడంతో 200 ఏళ్ల క్రితం నిర్మంచిన తకియా మసీదును జనవరి నెలలో అధికారులు కూల్చివేశారు. మసీ దును తిరిగి నిర్మించాలని దాఖలైన పిటిషన్లను తొలుత మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేయగా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం కూడా పిటిషన్ ను అనుమతించలేదు.





