News

వందేమాతరం గీతాన్ని పాడను.. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్

39views

సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ అజ్మీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. వందేమాతరం పాడమని నన్ను ఎవరూ బలవంతం చేయలేరు అన్నారు. బీజేపీ అంటే భారత్ జలావ్ పార్టీ.. అది భారతదేశాన్ని నాశనం చేసే పార్టీ అని ఆరోపించారు. వారు మతపరమైన రాజకీయాలు చేస్తారు, ప్రజలను విభజిస్తారు, ప్రజల్లో ద్వేషాన్ని వ్యాపింపజేస్తారని తెలిపారు. అధికారంలో ఉండటానికి ముస్లింలను అణచివేయడానికి ఎల్లప్పుడూ ప్రణాళికలు వేస్తారని చెప్పారు. అంశాలను కథనం నుంచి తీసేస్తే బీజేపీ సున్నా అని అబూ అసిమ్ వ్యాఖ్యానించారు.

ఇక, ఒక ముస్లిం అల్లాను మాత్రమే ప్రార్థిస్తాడు.. కానీ చాలా మంది ముస్లింలు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ లాగా భూమిని పూజిస్తారు అని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ తెలిపారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో పూర్తి వెర్షన్‌ వందేమాతరం పాడాలనే ఆదేశాలను తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పాఠశాలలు ‘వందేమాతరం’ యొక్క మొదటి రెండు చరణాలను మాత్రమే పాడుతున్నాయి.. ఇక, వందేమాతరం పాడమని నన్ను ఎవరూ బలవంతం చేయలేరు.. ఎందుకంటే, నేను వందేమాతరం గీతాన్ని పాడలేను అని స్పష్టం చేశారు. ఇక, మత విశ్వాసాలు వ్యక్తులలో మారుతూ ఉంటాయి.. కాబట్టి వందేమాతరం గీతాన్ని పారాయణను తప్పనిసరి చేయడం సముచితం కాదన్నారు. అలాగే, ఇస్లాం ఒకరి తల్లిని గౌరవించడానికి ప్రాముఖ్యత ఇస్తుంది, కానీ ఆమె ముందు సాష్టాంగ నమస్కారం చేయడానికి అనుమతించదని ఎమ్మెల్యే అబూ అసిమ్ అన్నారు.