
జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అనంత్ నాగ్ చెందిన ప్రభుత్వ మాజీ వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాథర్ లాకర్ లో AK-47 రైఫిల్ లభ్యమైంది. పోలీసులు ఈ రైఫిలన్ను స్వాధీనం చేసుకున్నారు. అనంత్నాగ్లోని జల్గుండ్ నివాసి ఆదిల్ 2024 అక్టోబర్ 24 వరకు GMC అనంత్నాగ్ పనిచేశాడని పోలీసులు తెలిపారు. నౌగామ్ పోలీస్ స్టేషన్లో FIR నంబర్ 162/2025 కింద భారత శిక్షాస్మృతి, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఈ అంశంపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నాయి.
ఓ ప్రభుత్వ మాజీ వైద్యుడు ఇలాంటి ఆయుధాన్ని కలిగి ఉండటం కలకలం సృష్టించింది. నిందితుడు ఆదిల్ ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నాడని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆదిల్ అహ్మద్ రాథర్ నుంచి స్వాధీనం చేసుకున్న అయుధాన్ని పోలీసులు సమీక్షించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. AK-47 రైఫిల్ వంటి ఆయుధాలను లాకర్ వంటి సురక్షితమైన ప్రదేశాలలో ఎలా దాచారో అనే అంశంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. శ్రీనగర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో డిజిటల్, భౌతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.





