
పోలీసు సిబ్బంది సరైన మార్గంలో జీవించాలనే ఉద్దేశంతో తమ శిక్షణా కేంద్రాల్లో భగవద్గీత పఠన కార్యక్రమాలను ప్రారంభించాలని మధ్యప్రదేశ్ పోలీసు శిక్షణ విభాగం నిర్ణయించింది. ఈ మేరకు శిక్షణ విభాగం అదనపు డీజీ రాజాబాబుసింగ్ రాష్ట్రంలోని ఎనిమిది శిక్షణా కేంద్రాలకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కేంద్రాల్లో ప్రస్తుతం 4వేల మంది శిక్షణ పొందుతున్నారు. జూలైలో నూతన బ్యాచ్ ప్రారంభ సందర్భంలోనూ శిక్షణార్థులు ప్రతిరోజు తప్పనిసరిగా రామచరితమాన్సను పఠించాలని రాజాబాబుసింగ్ సూచించారు. శ్రీరాముని జీవిత విలువలను, ఆయన 14 సంవత్సరాల వనవాసాన్ని వర్ణించే ఆ గ్రంథం వారిలో క్రమశిక్షణను పెంపొందిస్తుందని తెలిపారు. గతంలో గ్వాలియర్ రేంజ్ ఐజీగా ఉన్నప్పుడు కూడా ఆయన ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టి, ఖైదీలకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. మధ్యప్రదేశ్ పోలీసు శిక్షణలో భగవద్గీత పఠనం తప్పనిసరి





