News

హిందూ వివాహ చట్టం పరిధిలోకే బంజారా వివాహాలు

51views

హిందూ ఆచారాలతో నిర్వహించే బంజారా వివాహాలు హిందూ వివాహ చట్టం పరిధిలోకే వస్తాయని ఢిల్లీ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. తమ జంట షెడ్యూల్డ్‌ తెగలకు చెందినందున హిందూ వివాహ చట్టం కింద వేసిన విడాకుల పిటిషన్‌ను కొనసాగించరాదని ఒక మహిళ భర్త దాఖలు చేసిన అభ్యంతరాన్ని డివిజన్‌ బెంచ్‌ తోసిపుచ్చింది.హిందూ వివాహ చట్టం కింద ఒక మహిళ దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ ఆమోదయోగ్యమైనదేనంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్లు సమర్థించింది.