
నార్త్ కరోలినా, US,: నార్త్ కరోలినా లోని అతిపెద్ద హిందూ సమూహం అయిన ట్రయాంగిల్ ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మాణమవబోతోంది. హిందువుల పవిత్ర దేవుడు, ముఖ్యంగా తమిళలు ఆరాధ్యుడు అయిన భగవాన్ మురుగన్ కి సంబంధించిన అతిపెద్దదయిన విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం. 130 ఎకరాలు ఉన్న ఈ ప్రాంతంలో 155 అడుగుల పొడవు, 35 అడుగుల పునాదిపై అమర్చబడి ఉంటుంది. అంటే మొత్తం 190అడుగుల ఎత్తులో విగ్రహం ఉంటుంది. చేతిలో వేల్ ధరించిన యోధుడి రూపంలో ఈ విగ్రహాన్ని రూపొందించారు. అంతేకాకుండా ఇక్కడే లైబ్రరీ, మ్యూజియం ను, వివాహవేదిక, కమ్యూనిటీ గార్డెన్ లాంటివి కూడా రూపొందించనున్నారు.
. కరోలినా మురుగన్ ఆలయ ప్రధాన కార్యదర్శి కారీకి చెందిన రాధా రవి వర్మ మాట్లాడుతూ, ఈ ఆలయం ట్రయాంగిల్ ప్రాంతంలో, తమిళ వారసత్వానికి చెందిన హిందూ ప్రజలకు సేవ చేస్తుందని చెప్పారు. ఈ ఆలయాన్ని ఎవరైనా సందర్శించవచ్చని చెప్పారు. నార్త్ కరోలినా ప్రాంతంలో ఎక్కువగా హిందువులు నివసిస్తుంటారు. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ 2015లో నార్త్ కరోలినాలో భారతదేశం నుండి వచ్చిన 60,000 మందికి పైగా నివాసితులు ఉన్నారని అంచనా వేసింది.





