
47views
పరారీలో ఉన్న వివాదాస్పద మత బోధకుడు, భారత్ బలగాలు అన్వేషిస్తున్న జకీర్ నాయక్‌ను తమ దేశంలోకి అనుమతించకూడదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించినట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. జకీర్ రావడంపై హోం మంత్రిత్వశాఖ నేతృత్వంలో జరిగిన లా అండ్ ఆర్డర్ కోర్ కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. జకీర్ బంగ్లాదేశ్‌కు వెళ్తే ఆయన కార్యక్రమాలకు పెద్దఎత్తున జనసమూహం వచ్చే అవకాశం ఉందని, వారి నియంత్రణకు భారీగా బలగాలను మోహరించాల్సి ఉండటంతో ప్రస్తుతం అది సాధ్యపడదని ఆయన పర్యటనను నిరాకరించినట్లు వివరించాయి. ప్రభుత్వ అనుమతితో జకీర్‌ను నవంబరు చివరిలో బంగ్లాకు తీసుకొస్తామని స్పార్క్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఇటీవల వెల్లడించింది.





