News

మలబార్ గోల్డ్, డైమండ్స్ సంస్థకి హిందువుల ఝలక్

56views

దీపావళి పండగ సందర్భంగా హిందువులు మలబార్ గోల్డ్, డైమండ్స్ సంస్థకి భారీ ఝలక్ ఇచ్చారు. ఈ సీజన్ లో మలబార్ మసకబారింది. హిందువుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పండగ సీజన్ లో అమ్మకాల్లో 30 నుంచి 40 శాతం తగ్గుదల ఎదుర్కొంది.

ఎందుకంటే దీపావళి, ధంతేరాస్ సమయంలో ప్రచారం సందర్భంగా మలబార్ కంపెనీ పాకిస్తాన్ influencer అలీష్బా ఖలీద్ అనే మహిళ తో ప్రచారం చేయించింది. ఆ ప్రచారం చేసే వ్యక్తి భారత వ్యతిరేకిగా ముద్ర పడ్డాడు. అలాంటి వ్యక్తిని నియమించడంతో ప్రజలు, ముఖ్యంగా జాతీయవాదులు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో బహిష్కరణ ప్రారంభమైంది. సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేకతను ఎదుర్కొంది. దీంతో పోస్టులపై హైకోర్టును ఆశ్రయించింది మలబార్.ఈ పోస్టులు కంపెనీ అమ్మకాలను దెబ్బతీస్తున్నాయని, ముఖ్యంగా పండుగ సీజన్‌లో ఈ పోస్టులు దెబ్బతీస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. కంపెనీ పరువు నష్టం కలిగించే కంటెంట్ ఉన్న 442 URLల జాబితాను కూడా సమర్పించింది మరియు మరిన్ని పోస్టులను నిరోధించడానికి నిషేధం విధించాలని కోరింది.

దీంతో హైకోర్టు స్పందిస్తూ.. ఆ పోస్టులను తొలగించాలని ఆదేశించింది. జస్టిస్ సందీప్ మార్నేతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. పాక్ సానుభూతిపరులు అనే పోస్టులను తొలగించాలని సూచించింది.

ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ విజయ్ గజేరాపై మలబార్ గోల్డ్ సంస్థ లీగల్ చర్యలు తీసుకోవడంతో ఆయన అకౌంట్ సస్పెండ్ అయింది. దీంతో ఇన్‌ఫ్లుయెన్సర్లు, ప్రజలు అందరూ విజయ్‌కు మద్దతుగా నిలిచారు. ఈ పరిస్థితిని సరిదిద్దుకోవడం మలబార్ గోల్డ్ సంస్థకు తలనొప్పిగా మారింది.ఈ సందర్భంగా విజయ్ గజేరా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘మలబార్ గోల్డ్ విపరీతంగా డబ్బులు వెచ్చించి పీఆర్ కథనాలను అమలు చేస్తోంది. అలాగే నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కూడా ప్రయత్నిస్తోంది. గల్ఫ్ కి చెందిన పెట్టుబడిదారులు ఇలాంటి వాటిని ప్రభావితం చేసే అవకాశం వుంది. మలబార్ గోల్డ్ లో గల్ఫ్ దేశాల పెట్టుబడులు కూడా వున్నాయి. కొందరు నా భద్రత గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కానీ నా వైఖరి సుస్పష్టం. దేశభక్తి గల భారతీయులను నిశ్శబ్దంగా వుంచడానికి వారు ధనాన్ని కూడా ప్రయోగిస్తారు. కానీ వారికి నేను తలొగ్గను’’ అని పేర్కొన్నారు.

అంతేకాకుండా మలబార్ ను విమర్శించిన వారందరిపై పెట్టిన కేసులను బేషరతుగా వెంటనే కంపెనీ ఉపసంహరించుకోవాలని కూడా డిమాండట్ చేశారు. బహిరంగంగా కూడా క్షమాపణలు అడగాలన్నారు.

మరోవైపు మలబార్ గోల్డ్ పై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. బలమైన దేశీయ కస్టమర్ బేస్ వున్నా… భారత వ్యతిరేక భావజాలం వున్న మహిళతో, భారత సైన్యాన్ని తీవ్రంగా అవమానించిన మహిళతో ప్రచారం చేయడంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. సామాజిక వేదికలలో వేలాది మంది వినియోగదారులు దేశవ్యాప్తంగా బహిష్కరణకు పిలుపునిచ్చారు.

మరోవైపు మలబార్ గోల్డ్ తన 27,500 మంది ఉద్యోగులకు ఓ మెయిల్ కూడా పంపింది. వివాదాన్ని అందులో తక్కువ చేసి చూపించింది. అసంపూర్ణ పోస్ట్ అంటూ తక్కువ చేయడానికి చూపించింది. మరోవైపు వీటన్నింటినీ తాము అర్థం చేసుకున్నామని, తప్పుదారి పట్టించేవంటూ స్పందించింది కూడా. అన్నీ నిర్ధారించుకున్న తర్వాత ఆ ప్రచారాన్ని నిలిపేశామని కూడా తెలిపింది.