News

సంఘ శతాబ్ది, జ్యేష్ఠ స్వయంసేవకులకు సన్మానం

55views

ప్రస్తుతం మనం సంఘ అనుకూల వాతావరణంను దర్శించుచున్నామంటే ఆనాడు స్వయంసేవకులు చేసిన త్యాగాలు, సంఘం పట్ల వారికి గల నిబద్ధతే కారణం అని సంఘశతాబ్ది సందర్భంగా జ్యేష్ట స్వయం సేవకులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ కార్యకారిణి సభ్యులు ఒలేటి సత్యనారాయణ అన్నారు. అప్పటితరం కార్యకర్తలు ఇప్పుడు మన మధ్య లేరు. వారిని స్మరించుకుంటూ నేటి కార్యకర్తలను సన్మానించుకోవడం అంటే అప్పటి తరంవారిని సన్మానించడమేనని ఆయన అన్నారు.

అక్టోబర్ 21న రాజమండ్రిలోని జిఎన్ఎల్ వైద్యకళాశాలలో ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్ర సమన్వయం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విభాగ్ లో ఉన్న 11 మంది ముందుతరం స్వయం సేవకుల దంపతులను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ప్రాంత సహసంఘచాలక్ సుంకవల్లి రామకృష్ణారావు, విభాగ్ సంఘచాలక్ మంతెన రామచంద్రరాజు, విభాగ సహసంఘచాలక్ రిమ్మలపూడి సుబ్బరాజు, ప్రాంత ప్రచారక్ విజయాదిత్య పాల్గొన్నారు.