
అమెరికా సంయుక్త రాష్ట్రాలు క్రైస్తవ మత విశ్వాసాల ఆధారంగా నడుస్తాయి. ఇంతవరకు ఇదే వాస్తవం. కానీ ఆ విశ్వాసాలు పునాదిని కోల్పోతున్నాయని ప్యూ రిసెర్చ్ సెంటర్ ఇటీవల వెల్లడించింది. 2070 నాటికి అంటే ఇంకో 45 సంవత్సరాలకి అక్కడ క్రైస్తవం అధిక సంఖ్యాకుల మత విశ్వాసంగా నిలబడి ఉండలేదు.
1970లో జరిపిన సర్వే ప్రకారం తాము క్రైస్తవ విశ్వాసానికి నిబద్ధులమని 90 శాతం ప్రజలు చెప్పారు. ఇప్పుడు ఆ సంఖ్య 62 శాతానికి దిగింది. ప్రస్తుతం అమెరికాలో కొనసాగుతున్న ధోరణి ఇదే విధంగా కొనసాగితే 2027కి క్రైస్తవ విశ్వాసులు 45 శాతానికి పరిమితమవుతారని వ్యూ రీసెర్చ్ సంస్థ స్పష్టం చేస్తున్నది. ఇదెంతో ప్రమాదకరమో ఆలోచించాలని పాస్టర్ బ్రెంట్ మదారిస్ వంటివారు హెచ్చరిస్తున్నారు. ఈ లెక్కలను బట్టి చర్చిని అంటే క్రైస్తవం విశ్వాసాన్ని పునరుద్ధరించడం అత్యవసరంగా ప్రారంభించలని మదారిస్ (హెూమ్హన్ హెూప్ మినిస్టరీస్) డెయిలీ మెయిల్తో తో అన్నారు.
శత్రుమత విశ్వాసాలు, ప్రధానంగా ఇస్లాం, బాగా వేళ్లూనుకోక ముందే క్రైస్తవులు మేల్కొన్నాలని మదారిస్ పిలుపునిచ్చారు. ఇతర మత విశ్వాసాలు అమెరికాలో ఇప్పుడు బాగా విస్తరిస్తున్నాయని కూడా ఆయన తెలియచేశారు.
ప్రతి ఏటా లక్ష మంది ముస్లింలు అమెరికా జనాభాలో కలుస్తున్నారని, కానీ అమెరికాలోని క్రైస్తవులు మార్రి 20 లక్షలకు మించడం లేదని అన్నారు. ఇప్పటికీ ముస్లింలు అక్కడ మైనారిటీలే. వారి సంఖ్య 20 లక్షలు. క్రైస్తవ జనాభా 20 కోట్లు. ఇక్కడ ముస్లిం జనాభాయే కాదు, మసీదుల సంఖ్య కూడా వేగంగా పెరిగిపోతున్నది. 2010-2020 మధ్య ఒక్క దశాబ్దంలోనే 31 శాతం పెరిగిపోయాయి. అంటే 2010లో 2,106 ఉన్న మసీదులు ఇప్పుడు 2,769కి చేరుకున్నాయి. ఈ మసీదుల సంగతి ఇస్లామిక్ రిసోర్స్ సెంటర్ చెప్పిందే, కానీ అదే దశాబ్దంలో దాదాపు 1500 చర్చ్లు మూతపడినాయి. ముస్లిం జనాభా ఇంతగా పెరగడానికి కారణం, ఆ వర్గంలో యువ జనాభా ఎక్కువ. అలాగే గర్భోత్పత్తి సామర్థ్యం ఎక్కువ. సీబీఎస్ అనే మరొక సంస్థ ఈ ఫిబ్రవరిలో విడుదల చేసిన ఒక నివేదిక చిత్రమైన విషయం బయటపెట్టింది. జైలు నుంచి విడుదలైన వారిలో చాలామంది ఇస్లామ్లోకి మారి వస్తున్నారట. అంటే జైలులో ఈ పని ఎక్కువగా జరుగుతున్నది.





