
కార్తిక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 5న దేవస్థానం సేవాదళ్ ఆధ్వ ర్యంలో దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు దుర్గగుడి ఈవో శీనానాయక్ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై మల్లికార్జున మహామండపం నాలుగో అంతస్తులోని ఈవో కార్యాలయంలో పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ప్రధానార్చకులు దుర్గాప్రసాద్, స్థానా చార్య శివప్రసాద్ శర్మ ఏసీపీలు దుర్గారావు, రామ చంద్రరావులతో కలిసి భవానీ దీక్షల విరమణ, కార్తిక మాస వేడుకలకు సంబంధించిన గోడపత్రాలను విడుదల చేశారు. అనంతరం వైదిక కమిటీ, పోలీసు, ఇంజినీరింగ్ దేవస్థానం అధి కారులతో సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ.. భక్తుల భద్రత దృష్ట్యా దీపాలు వెలిగించేందుకు ప్రత్యేకంగా 500 మంది సేవాదళ్ సభ్యులు అర్చకులకు సహకరిస్తా రన్నారు. డిసెంబరు 4న సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి దుర్గగుడి వరకు ఊరేగింపులో భవానీ దీక్షాధారులు పాల్గొంటారని చెప్పారు. పశ్చిమ, వన్ ట్రాఫిక్ ఏసీపీలు దుర్గా రావు, రామచంద్రరావు, సీఐలు ఉమామహేశ్వర రావు, గురుప్రకాష్, ఈఈలు కోటేశ్వరరావు, రాంబాబు, ఏఈవోలు రమేష్, వెంకటరెడ్డి, సుధా రాణి, చంద్రశేఖర్, వాసు, గంగాధర్ పాల్గొన్నారు.





