
27views
బీహారీ ప్రజలు గొప్పగా జరుపుకునే ఛాట్ పూజకు .. యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు తీసుకురానున్నట్లు ప్రధాని మోదీ(తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముజాఫర్‌పుర్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఎంతో సంతోషంగా బీహారీ ప్రజలు ఛాట్ పూజను జరుపుకుంటారని, ఆ పండుగను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తున్నదని, కానీ తమ ప్రభుత్వం ఛాట్ పూజకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తునదన్నారు. ఓట్ల కోసం ఛాట్ ఉత్సవాన్ని కాంగ్రెస్, ఆర్జేడీ అవమానిస్తున్నదన్నారు.
 
			




