News

హిందూ దేవాలయంలో అన్యమత నినాదాలు చేసిన కబీర్

31views

కర్నాటకలోని దేవర బీసనహళ్లిలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో ఈ నెల 28 న దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ కి చెందిన కబీర్ అనే వ్యక్తి చెప్పులు ధరించి, గర్భగుడిలోకి ప్రవేశించాడు. అంతేకాకుండా దేవతా విగ్రహాలను కాలితో తన్ని, మందిర ప్రాంగణాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటన స్థానిక భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.

ఈ నెల 28 న ఉదయం 8:30 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రత్యక్ష సాక్ష్యుల ప్రకారం కబీర్ ఉదయం మతపరమైన నినాదాలు చేసుకుంటూ ఏకంగా వేణుగోపాల స్వామి ఆలయంలోకి ప్రవేశించినట్లు ఓ దుకాణపు యజమాని పేర్కొన్నారు. అంతేకాకుండా దేవాలయంలోకి ప్రవేశించే ముందు మెడికల్ ముందు వున్న గణేషుడి ఫొటోను కర్రతో కొట్టాడని దీంతో స్థానికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా కబీర్ తన మతానికి అనుకూలంగా నినాదాలు చేస్తూ, దేవాలయం వైపు వచ్చాడని తెలిపాడు.

ఇక.. దేవాలయం దగ్గరికి చేరుకున్న తర్వాత గరుడ స్తంభంపై రాయి విసిరి, ఆపై నూనె సీసాను తీసుకొని, చెప్పులతోనే ఏకంగా దేవాలయంలోకి ప్రవేశించాడు.ఆ తర్వాత విగ్రహాన్ని తన్ని, అపవిత్రం చేశాడు.
ఇది కాస్త వ్యాపించడంతో స్థానికులు దేవాలయానికి చేరుకున్నారు. కబీర్ ను అక్కడికక్కడే పట్టుకున్నారు. అంతేకాకుండా చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ప్రాథమిక దర్యాప్తులో కబీర్ బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి ఉండవచ్చని తెలుస్తోంది. విచారణ సమయంలో, అతను బంగ్లాదేశ్ పౌరుడని తెలిపాడు. అధికారులు ఇప్పుడు అతని గుర్తింపు మరియు నేపథ్యాన్ని మరింత ఆారా తీస్తున్నారు.
bangladeshi nationalbangladesh kabir