
తనదాకా వస్తే గానీ తెలియదు అనేది ఓ సామెత. లవ్ జిహాద్ అసలు లేనేలేదని, ఆరెస్సెస్, హిందుత్వ వాదుల సృష్టేనంటూ చెప్పుకొచ్చిన కమ్యూనిస్టులకు తత్వం బోధపడింది. ఈ ఆపదే ఓ కమ్యూనిస్టు కూతురుకే వచ్చింది. దీంతో అది లేనే లేదు.. అదంతా సృష్టే అని మహా లౌకికత్వాన్ని ప్రదర్శిస్తూ తత్వ బోధ చేయాలి కదా.. అబ్బే అలా ఏమీ చేయలేదు.. లవ్ జిహాద్ లో తన కూతురు ఇరుక్కుందని తెలిసిన తర్వాత ఓ కమ్యూనిస్టు నేత ఏం చేశాడో తెలుసా…
కాసర్ గఢ్ కి చెందిన సీపీఎం పార్టీ ఉడుమ ఏరియా కమిటీ సభ్యుడు పవీ భాస్కరన్ కే ఈ పరిస్థితి వచ్చింది. తన కూతురు సంగీత తన దగ్గరికి వచ్చి, ముస్లింని వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేసింది. చెప్పడమే ఆలస్యం.. అపర కమ్యూనిస్టు నేత భాస్కరన్ హింస చేయడం ప్రారంభించారు.
తన ఇంట్లోనే కుమార్తె సంగీతను బంధించి, దారుణంగా హింసిస్తున్నాడని సంగీత ఓ వీడియో ద్వారా ప్రకటించింది. దీంతో పెద్ద సంచలనమే రేగింది.
అయితే కొన్ని రిపోర్టుల ప్రకారం సంగీత నడుము కింద పక్షవాతంతో బాధపడుతోందని, చాలా బాధలతో వుందని అంటున్నారు. అయినా సరే లవ్ జిహాద్ బయటపడటంతో తాను గృహ నిర్బంధంలో వున్నానని, చికిత్స కూడా చేయించడం లేదని పేర్కొంది. అంతేకాకుండా తన ఆస్తిలోని వాటాను కూడా లాక్కోవడానికి ప్రయత్నించాడని, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా తనను ఒప్పించారని చెప్పుకొచ్చింది. విడాకుల తర్వాత తనకు మొత్తం అందిన భరణాన్ని తన తండ్రి, సోదరుడే స్వాధీనం చేసుకున్నారని, సరైన వైద్యం కూడా అందడం లేదని తెలిపింది.వేరే మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనే తన కోరికను వ్యక్తం చేసిన తర్వాత హింస తీవ్రమైందని ఆమె ఆరోపిస్తోంది. తన తలపై చాలాసార్లు కొట్టారని, “వెళ్లి చనిపో” అని చెప్పారని కూడా ఆమె ఆరోపిస్తోంది.
కమ్యూనిజం, ఇలాంటి వాటికి ఈ ఇంట్లో స్థానం లేదని కూడా తన తండ్రి బెదిరిస్తున్నాడని, తన మాట వినకపోతే చంపేస్తానని కూడా అంటున్నాడని చెప్పుకొచ్చింది. తన వద్ద అధికారం వుందని, తనను ఏమీ చేయలేరని కూడా చెప్పుకొచ్చాడని పేర్కొంది.
 
			




