
61views
మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బహిరంగ క్షమాపణలు చెప్పాలని విశ్వహిందూ పరిషత్ వీహెచ్‌పీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఎమ్మెల్యే, ఎంఎస్ రాజు తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘భగవద్గీత ప్రజల బతుకులను మార్చలేదంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉంటూ భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఇక, తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ స్పందించారు. ఈ సందర్బంగగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
 
			




