
88views
మోంథా తుపాను వల్ల రాష్ట్రంలో తీవ్రంగా దెబ్బతిన్నది. విపత్తులు సంభవించినప్పుడు, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర సంక్షోభాల సమయంలో, సహాయం అందించడానికి విశ్వహిందూ వి.హెచ్.పి తన వంతు సహాయాన్ని అందిస్తుంది.

ఇందులో భాగంగా నంద్యాల జిల్లా, విశ్వహిందూ పరిషత్ సేవా విభాగం తుపాను కారణంగా రైళ్ళు రద్దు, గత రెండు రోజులుగా ఆకలితో అలమటిస్తున్న వృద్ధులు, చిన్నారులు, ఇతరులకు భోజన పొట్లాట్లను పంపిణీ చేసిన ప్రయాణీకుల ఆకలి తీర్చడం జరిగింది. మొదటి రోజు 150 మందికి, రెండవరోజు 200 మందికి భోజన సదుపాయం కల్పించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదరు కార్యక్రమంలో ప్రాంత, జిల్లా స్థాయి కార్యకర్తలు, స్థానిక కార్యవర్గ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
 
			




