
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ -UAE యోగాను పోటీ క్రీడగా అధికారికంగా ప్రకటించడానికి చురుకుగా ప్రయత్నిస్తోంది. ఈ దేశం తీసుకన్న ఈ నిర్ణయం అనేది యోగాను వెల్నెస్, జీవనశైలి అభ్యాసం నుండి గుర్తింపు పొందిన క్రీడా విభాగంగా మారుస్తుందని ది నేషనల్ అనే పత్రిక నివేదించింది. ఈ మార్పు ప్రధానంగా భారతదేశంతో యుఎఇ లోతుగా పాతుకుపుపోయిన సాంస్కృతిక సంబంధాలు, అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులద్వారా జరిగింది. యోగాను క్రీడా విధానంలో సమగ్రపరచడం ద్వారా యుఏఈ యోగాసనాన్ని జీవనశైలిగా మాత్రమే కాకుండా గుర్తిపుం పొందిన విభాగంలో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. యోగాను ఒక క్రీడగా మార్చడం వల్ల కొత్త సంస్థాగత గుర్తింపు లభిస్తుంది.
సాంప్రదాయ అభ్యాసాన్ని నిర్మాణాత్మక పోటీగా మారుస్తుంది. ఇది యోగాను ప్రపంచీకరించాలనే భారతదేశం ప్రచారానికి కూడా అనుగుణంగా ఉంటుంది.
ఆగస్టు 2025 లో ఫుజరా 6వ ఆసియా యోగాసన ఛాంపియన్ షిప్ కు ఆతిథ్యం ఇచ్చినప్పడు యూఏఈ ఉద్దేశాలు స్పష్టమయ్యాయి. ఈ ఈవెంట్ 16 దేశాల నుండి 160 మంది అథ్లెట్ లను ఒకచోట చేర్చింది. అంతేకాక యోగాసనాన్ని పోటీ క్రీడారంగంగా ప్రదర్శించడంలో యూఏఈ అతిపెద్ద అడుగుగా గుర్తించబడింది. గల్ఫ్ దేశాలలో యోగాను ఒక క్రీడగా గుర్తించడంలో తొలి అడుగు అనే చెప్పవచ్చు. ఇది విజయవంతమైతే, అధికారిక నియమాలు, నిబంధనలు మరియు జాతీయ జట్టు ఈవెంట్లతో సహా యోగాకు పూర్తి క్రీడా గుర్తింపును మంజూరు చేసిన మొదటి గల్ఫ్ దేశంగా UAE అవతరిస్తుంది.
 
			




