News

బలూచిస్థాన్‌లో పాక్‌ వైమానిక దాడులు

Security personnel of Pakistan's Frontier Corps stand on an armoured vehicle near the newly inaugurated Badini†Trade†Terminal†Gateway, a border crossing point between Pakistan and Afghanistan at the Pakistan's border town of Qila Saifullah in the southwestern province of Balochistan on September 16, 2020. (Photo by Banaras KHAN / AFP)
41views

పాకిస్థాన్ మరోసారి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు ప్రారంభించింది. బలోచ్‌ లిబరేషన్ ఆర్మీ లక్ష్యంగా మానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

బలోచిస్థాన్‌లోని చిల్తాన్‌ పర్వత ప్రాంతంలో బీఎల్‌ఏ ఉగ్రవాదులే లక్ష్యంగా పాక్‌ బలగాలు కచ్చితమైన వైమానిక దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు చాలా రోజులుగా తమ నిఘాలో ఉన్నారని పాక్‌ పేర్కొంది. తాజా దాడుల నేపథ్యంలో ఉగ్రవాదులకు సంబంధించిన అనేక తాత్కాలిక రహస్య స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రావిన్స్‌లోని భద్రతా కాన్వాయ్‌లు, మౌలిక సదుపాయాలపై కూడా ఈ దాడులు జరిగినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. పాక్‌ తాజా దాడులపై బలోచిస్థాన్‌ ఇప్పటివరకు స్పందించలేదు.