News

రేపటి నుండి జబల్పూర్ లో ఆర్ఎస్ఎస్ కార్యకారిణి సమావేశాలు

40views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారత కార్యకారిణి వార్షిక సమావేశాలు గురువారం నుండి మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ జిల్లాలోని కచ్నార్ నగరంలో మూడు రోజులపాటు జరుపుతున్నట్లు అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. 407 మంది కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.

సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే లతో పాటు ఆరుగురు సహ-సర్ కార్యవాహులు, వీరితో పాటు పలువురు స్వయంసేవకులు పాల్గొంటారని చెప్పారు. కార్యకర్తలు కూడా పాల్గొంటారు.

2025 అక్టోబర్ 2న విజయదశమి నాడు నాగ్‌పూర్‌లో సంఘ శతాబ్ది సంవత్సరం ప్రారంభమైందని అప్పటి నుండి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో సంఘ శతాబ్ది సంవత్సర కార్యక్రమాలు జరిగాయన్నారు. గృహ సంపర్క్ కార్యక్రమం కింద, 25 నుండి 40 రోజుల ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.కుటుంబ ప్రభోధన్, సామాజిక సమరసత, పర్యావరణ అనుకూల జీవనశైలి, స్వదేశి, పౌరవిధులు వంటి పంచ పరివర్తన అంశాలను స్వయంసేవక్ లు కరపత్రాలు, బుక్‌లెట్‌లతో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు.

సామాజిక మార్పులో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషించాలని, సమన్వయంతో సామాజిక మార్పు తీసుకురావడానికి వారు ఎలా కలిసి పనిచేస్తారనే దానిపై కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితిని కూడా కార్యకారిణి సమావేశంలో చర్చించనున్నారని అంబేకర్ వివరించారు.

సర్ సంఘచాలక్ తన దేశవ్యాప్త పర్యటనలో భాగంగా వివిధ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూ సంఘ్ గురించి తెలియజేస్తారని, ఆయన నవంబర్ 8, 9 తేదీల్లో బెంగళూరులో, డిసెంబర్ 21న కలకత్తాలో, ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ముంబైలో ప్రసంగిస్తారని చెప్పారు.

విలేకరుల సమావేశంలో ప్రాంతీయ సంఘచాలక్ డాక్టర్ ప్రదీప్ దూబే, అఖిల భారత సహా ప్రచార ప్రముఖ్ లు నరేంద్ర ఠాకూర్, ప్రదీప్ జోషి పాల్గొన్నారు.