ArticlesNews

సంస్కృతం బాషా వైభవం కోసం పాటుపడుతున్న యువత

44views

సంస్కృతం పేరు వింటూనే మన మనసులో మన ధర్మ గ్రంధాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు, ప్రాచీన జ్ఞాన విజ్ఞానం, ఆధ్యాత్మికత, సందర్శన – ఇవన్నీ గుర్తుకు వస్తాయి. కానీ ఒకానొక కాలంలో వీటన్నింటితో పాటూ సంస్కృతం ఒక వాడుక భాషగా కూడా ఉండేది. ఆ యుగంలో అధ్యాయనం ,శోధన సంస్కృతంలోనే జరిగేవి. నాటక ప్రదర్శన కూడా సంస్కృతంలోనే ఉండేది. కానీ దురదృష్టం కొద్దీ బానిసత్వపు కాలంలోనూ, స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా సంస్కృతం చాలా నిర్లక్ష్యానికి గురయ్యింది. ఈ కారణంగా యువతలో సంస్కృతం పట్ల ఆకర్షణ తగ్గుతూ వచ్చింది.

కానీ, ఇప్పుడు కాలం మారుతోంది. అంటే ఇప్పుడు సంస్కృతానికి కూడా కాలం మారుతోంది. సంస్కృతి, సామాజిక మాధ్యమ ప్రపంచం కలిసి సంస్కృతానికి కొత్త ఊపిరిని అందించాయి. ఈ రోజుల్లో ఎందరో యువత సంస్కృతం తాలుకు ఎన్నో ఆసక్తికరమైన పనులు చేస్తున్నారు. మీరు సామాజిక మాధ్యమంలోకి వెళ్తే ఎన్నో రీల్స్ కనిపిస్తాయి. వాటిల్లో ఎందరో యువత సంస్కృతంలో సంస్కృతం గురించి మాట్లాడుతూ కనిపిస్తారు. ఎందరో వ్యక్తులు తమ సామాజిక మాధ్యమ ఛానళ్ల ద్వారా సంస్కృతాన్ని నేర్పిస్తున్నారు కూడా. ఇటువంటి ఒక యువ కంటెంట్ క్రియేటర్ , సోదరుడు యశ్ సాలుండ్కే. యశ్ కంటెంట్ క్రియేటరు, క్రికెట్ క్రీడాకారుడు కూడా. సంస్కృతంలో మాట్లాడుతూ క్రికెట్ ఆడుతూ ఆయన చేసిన రీల్ ని చాలామంది ఎంతగానో ఇష్టపడ్డారు.

అలాగే కమల, జాహ్నవి అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు గొప్ప పని చేస్తున్నారు. వీరిద్దరూ ఆధ్యాత్మికత, దర్శనం, సంగీతాలపై కంటెంట్ చేస్తారు. ఇన్స్టాగ్రాంలో – సంస్కృత్ ఛాత్రోహమ్ అనే మరొక యువకుడి ఛానల్ ఉంది . ఈ ఛానల్ ను నడిపే యువ మిత్రులు సంస్కృతంతో ముడిపడిన సమాచారాన్ని ఇవ్వడమే కాక, వాళ్ళూ సంస్కృతంలో హాస్య వీడియోలు కూడా తయారుచేస్తారు. సంస్కృతంలో ఉన్న ఈ వీడియోలను యువత ఎంతో ఇష్టపడతారు. మీలో చాలామంది మిత్రులు సమష్ఠి వీడియోలనూ చూసే ఉంటారు. సమష్ఠి సంస్కృతంలో తన గీతాలను రకరకాలుగా వినిపిస్తుంది. మరొక యువకుడు భావేశ్ భీమనాథనీ. భావేశ్ సంస్కృత శ్లోకాలను, ఆథ్యాత్మిక దర్శనాలు, సిధ్ధాంతాల గురించి మాట్లాడతారు.

ఏదైనా ఒక సమాజానికి చెందిన విలువలకు, వారసత్వానికి భాష వారధి లాంటిది. సంస్కృతం ఈ కర్తవ్యాన్ని వేల ఏళ్ల వరకూ నిర్వర్తించింది. ఇప్పుడు సంస్కృతం కోసం కొందరు యువత తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడాన్ని చూడడం చాలా ఆనందదాయకం.