
ఆరోగ్య భారతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం అక్టోబర్ 26 ఆదివారం నాడు గుంటూరులో అరండల్ పేటలోని యోగిభవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి అఖిలభారత సహ సంఘటన కార్యదర్శి డాక్టర్ మురళీకృష్ణ గారు క్షేత్ర సంఘటన కార్యదర్శి శ్రీ కుమారస్వామి గారు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి ఎస్ రావు గారు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ రామ్ శర్మగారు సంఘటన కార్యదర్శి డాక్టర్ కాకాని పృథ్వీరాజు సహకార దర్శి డా. ఏవియల్ నారాయణ, శ్రీమతి కామేశ్వరి గారు, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీ తిలక్, కోశాధికారి శ్రీ శంకర్ నారాయణలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆరోగ్య భారతి ప్రగతి పురోగతికి దోహదపడే విధంగా పలు కార్యక్రమాలను యోజన చేశారు. గృహం సంపర్కంతో పాటుగా ఆరోగ్య భారతి విషయాలను అన్ని గృహాలకు చేరవేయాలని కరపత్రాలను విడుదల చేశారు. ప్రముఖమైన ఆరు ఆయాములను అన్ని జిల్లాలకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఆరోగ్య మిత్ర కిషోర్ వికాస్ స్వస్థ గ్రామ యోజన పర్యావరణ మహిళ మొదలగు ఆయాములను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా యువజన చేశారు.

రాబోయే మాసాలలో ఆంధ్రప్రదేశ్లో కిషోరి వికాస్ యోజన ముందుకు తీసుకువెళ్లాలని దాని కోసం పలు కార్యక్రమాలను యోజన చేశారు. శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆరోగ్య భారతి డాక్టర్స్ తో కూడిన పెద్ద కార్యక్రమాలను విశాఖ ,విజయవాడ, కర్నూలు ప్రాంతాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య అవగాహనను పెంచడం, సామాజిక సేవా కార్యక్రమాల్ని విస్తరించడం లక్ష్యంగా ఉన్నాయి.
ఈ సమావేశం ద్వారా ఆరోగ్య భారతి సంస్థ వారి సేవలను మరింతగా ప్రజల జీవితాల్లోకి తీసుకు వచ్చేందుకు, ప్రజారోగ్య రంగంలో కొత్త పథకాలను చేపట్టి, రాష్ట్రంలోని ఆరోగ్యాభివృద్ధికి జోరుగా ముందడుగులు వేయనున్నారని అంచనా.





