News

ఇంద్రకీలాద్రి కనకదుర్గా నగర్ నుంచి దర్గా నగర్ గా పేరు మారబోతుందా?

65views

రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కనకదుర్గా నగర్ ప్రాంగణం ఇప్పుడు దర్గా నగర్ గా మారబోతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కనకదుర్గా నగర్ లో పూర్వకాలంలో అమ్మవారి పొంగల్ షెడ్లు ఉండేవి అక్కడ భక్తులు అమ్మవారికి నైవేద్యం తయారు చేసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్లేవారు, అయితే రాను రాను అక్కడ అన్య మత ప్రార్థన మందిరం ఏర్పడటం తదినంతరం అది దర్గాగా రూపొందించడం తర్వాత ప్రకాశం బ్యారేజీ నుండి అమ్మవారి గుడికి నేరుగా వచ్చే మార్గాన్ని సైతం ఆక్రమించి పూర్తిగా అక్రమ కట్టడాలు నిర్మించడం, చకచక జరిగిపోయింది.

ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి కనకదుర్గా నగర్ గా ఉన్న ఆ ప్రాంగణం పేరుని కొత్తగా ఏర్పాటు చేసిన అన్యమతా ప్రార్ధన మందిరం బోర్డుకి దర్గా నగర్ ని పేరు పెట్టడంతో దుర్గమ్మ భక్తులు విస్మయానికి లోనవుతున్నారు, అసలు అమ్మవారి పొంగలి షెడ్డుని ఆక్రమించి అన్యమత ప్రార్ధన మందిని ఏర్పాటు చేసుకుంటే సోదరభావంతో పోనీలే అనుకుంటే ఏకంగా ఇప్పుడు అమ్మవారి ప్రాంగణం పేరుని మార్చడం వారు ఆందోళన చెందుతున్నారు, కాబట్టి ఇప్పటికైనా అధికారులు దేవాదాయ శాఖ అధికారులు మున్సిపల్ అధికారులు మేల్కొని ప్రసిద్ధిగాంచిన కనకదుర్గ నగర్ ని పరిసర ప్రాంతాల్ని కాపాడాల్సిందిగా హిందూ బంధువులు, విజయవాడ నగర పౌరులు, అమ్మవారి భక్తులు కోరుకుంటున్నారు.