
దీపావళిపండుగ సందర్భంగా పటాకులు పేలుస్తున్నారన్న కారణంగా తీవ్రవాద ముస్లింలు కొందరు ఓ హిందూ కుటుంబంపై తీవ్రంగా దాడిచేశారు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని కాందివలి ప్రాంతంలో ఎక్తా నగర్ లో నివాసం ఉంటున్న ఓ హిందు కుటుంబం మంగళవారం(అక్టోబర్ 21)న దీపావళి వేడుకల్లో భాగంగా పటాకులు కాలుస్తున్నారు. ఆ ఇంటికి సమీపంలో నివసించే ముస్లిం సమాజంలోని కొంతమంది ఆ శబ్దం , పొగను వ్యతిరేకించారు. మొదట్లో ఇది ఒక సాధారణ వాదన, కానీ చిన్న వివాదం త్వరగా శారీరక ఘర్షణగా మారింది. పటాకులు కాల్చడం ఆపకుంటే వాటిని మీ ఇంట్లో కాలుస్తాం అంటూ కోపంతో ముస్లిం కుటుంబం కోపంతో కర్రలు , రాడ్‌లతో హిందూ కుటుంబంపై తీవ్రంగా దాడి చేసింది. కుటుంబంలోని మగవారిని కిందపడేసి, తన్ని, రాడ్ లతో గాయపరిచారు. మహిళని కూడా చూడకుండా ఛాతిపై బలంగా తన్నారు. దాంతో అక్కడ తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో మహిళతో సహా, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అయితే ఆ ప్రాంతంలో ఇలాంటి వివాదాలు ఇప్పుడే కాదు, ప్రతి పండుగ సమయంలోనూ చోటుచేసుకుంటున్నాయి. ప్రతి హిందువు పండుగను అక్కడ ఉన్న ముస్లిం కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి. గణేష్ ఉత్సవం సందర్భంలోనూ ఇలాంటి సంఘటనే అక్కడ జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ సంఘటన కేవలం పటాకులు పేల్చడానికి సంబంధించిన విషయమా లేక పాత శత్రుత్వం నుండి ఉద్భవించిందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ సంఘటనపై బాధితుడు కాండివలి పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదిచ్చాడు. కాండివలి పోలీస్ స్టేషన్ నుండి సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసులు భారత శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్లు 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), మరియు 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేసి, ఇద్దరు సోదరులు ఆలం ఖాన్ ,అజాన్ ఖాన్ మరియు వారి బంధువు తాహిర్ హుస్సేన్‌లను అరెస్టు చేశారు. హింసాత్మక ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. చిన్న వాదన తర్వాత రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నట్లు, పక్కనే ఉన్నవారు వారిని వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియో స్పష్టంగా చూపిస్తుంది. సోషల్ మీడియాలో ఏ పార్టీ కూడా పుకార్లు వ్యాప్తి చేయకూడదని మరియు శాంతిని కాపాడాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు .
 
			




