News

శివసేవకులకు మెరుగైన సౌకర్యాలు

31views

శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులకు సేవలందిస్తున్న శివసేవకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేశ్‌ నాయుడు తెలిపారు. దేవస్థానం సీసీ కమాండ్‌ కంట్రోల్‌ గదిలో ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈవో ఎం.శ్రీనివాసరావు, సభ్యులు ఎ.వి.రమణ, బి.రవణమ్మ, జి.లక్ష్మీశ్వరి, కె.కాంతివర్ధిని, శంకరశెట్టి పిచ్చయ్య, జె.రేఖాగౌడ్, ఎ.అనిల్‌కుమార్, దేవకి వెంకటేశ్వర్లు,బి.వెంకట సుబ్బారావు, సి.హెచ్‌.కాశీనాథ్, ఎం.మురళీధర్, సుబ్బలక్ష్మి, పి.యు.శివమ్మ, జి.శ్రీదేవి, ప్రత్యేక ఆహ్వానితులు కె.నాగమల్లేశ్వరరావు, వి.కోటారెడ్డి, బి.చంద్రమౌళీశ్వరరెడ్డి, కె.సుధాకర్‌రెడ్డి, వి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దేవస్థానం అధికారులు, సభ్యుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో అన్నప్రసాద వితరణ, ఆలయ ఆదాయ వ్యయాలు, ఇటీవల ప్రధాని పర్యటనపై చర్చించారు. భక్తులకు కల్పిస్తున్న దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలు, మాస్టర్‌ప్లాన్‌ అభివృద్ధి పనులను ఈవో వివరించారు. ఛైర్మన్‌ మాట్లాడుతూ..కార్తిక మాసంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా ప్రవేశపెట్టిన కోటి దీపోత్సవంతోపాటు కృష్ణమ్మకు హారతి, తెప్పోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. స్పర్శ దర్శనం భక్తులకు ప్రసాదం అందజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాబోయే 50ఏళ్లను దృష్టిలో పెట్టుకొని మాస్టర్‌ప్లాన్‌ అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. మాస్టర్‌ప్లాన్‌ను 3 దశల్లో అమలు చేస్తామని చెప్పారు.