
తెలుగు సంస్కృతి సంఘం ఆధ్వర్యంలో బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ ఎంపీ వీరేంద్ర శర్మ, వలేరి వాజ్ బ్రహ్మ శ్రీ, పద్మశ్రీ గరికపాటి నరసింహ రావు గారికి సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పద్మశ్రీ గరికపాటి నరసింహ రావుభారతీయ రచనలు, పాశ్చాత్య సాహిత్యానికి ఉన్న సంబంధాన్ని, సారూప్యతలను చాలా చక్కగా వివరించారు. గరికపాటి గారు రచించిన ఒషెన్ బ్లూస్ సముద్రం గురించి, ప్రముఖ రచయిత షేక్స్ పియర్ గురించి రాసిన కవితలు అద్భుతంగా వివరించారు.
భారతీయ రచనలు, మంగళ ప్రదంగా మొదలై, మంగళ ప్రదంగా నడుస్తూ, మంగళ ప్రదంగా ముగుస్తాయి అని అద్భుతంగా వివరించారు.పాశ్చాత్య రచనల్లో అతి ప్రముఖమైన షేక్స్ పియర్ రచనలైన హామ్లెట్ వంటి రచనల్లో పాత్రధారుల అన్ని కోణాలు ఆవిష్కరించబడతాయని వివరించారు. లండన్ లోని గ్లోబ్ థియేటర్ లో షేక్స్ పియర్ గారి నాటకాలు ఎంత విజయవంతంగా ప్రదర్శించబడ్డాయో వివరించారు.