
మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లవద్దని ఎమ్మెల్యే గోపీచంద్ పడాల్కర్ సలహా ఇచ్చారు. బీడ్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాలేజీకి వెళ్లే హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లకూడదని, ఇంట్లో యోగా సాధన చేయాలని సూచించారు. కుట్ర జరుగుతోందని, ఎవరిని నమ్మాలో వారికి తెలియదని ఆయన అన్నారు.
‘‘ఒక పెద్ద కుట్ర జరుగుతోంది, దానిని స్పష్టంగా అర్థం చేసుకోండి. చాలా మంచివాడు లేదా బాగా మాట్లాడే వ్యక్తిని చూసి మోసపోకండి” అని గోపీచంద్ పడాల్కర్ అన్నారు. వేరే వర్గానికి చెందిన వ్యక్తులు హిందూ అమ్మాయిలను ఆర్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ‘‘జిమ్‌లో తన ట్రైనర్ ఎవరు అనే దానిపై ప్రజలు శ్రద్ధ వహించాలి. మహిళలు జిమ్‌కు వెళితే ఇంట్లో వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అమ్మాయిలు ఇంట్లో యోగా సాధన చేయాలి. జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేస్తారు. మీకు అన్యాయం చేస్తారు’’ అని ఆయన అన్నారు. ఎలాంటి ఐడెంటిటీ లేకుండా కాలేజీలకు వచ్చే యువకుల్ని గుర్తించి, లోనికి రానీయకుండా నిరోధించాలని ఆయన అన్నారు.