News

కేరళలో ఆనందు అజి మరణం – వాస్తవాలు, పుకార్లు, పరిశీలన

204views

తాజాగా కేరళకు చెందిన ఆనందు అజి (24) అనే యువకుడి మరణం చుట్టూ వివిధ పుకార్లు మరియు రాజకీయ ఆరోపణలు మార్మోగుతున్నాయి.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) క్యాంపులో వేధింపుల కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో జరిగిన పరిశీలనలో ఈ పుకార్లు నిజం కావని తేలింది.

ఘటన వివరాలు
ఆనందు అంజి స్వస్థలం కేరళలోని కొట్టాయం జిల్లా – పొంకున్నం.అక్టోబర్ 10వ తేదీ రాత్రి అతను ఇంటిని విడిచి, తిరువనంతపురంలోని తంపనూర్ లాడ్జ్‌కు వెళ్లాడు.కొన్ని గంటల తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు.అతని మరణం జరిగిన కొద్దిసేపటికి అతని Instagram ప్రొఫైల్‌లో ఒక “షెడ్యూల్డ్ పోస్ట్” కనిపించింది.ఆ పోస్ట్‌లో RSS వ్యవస్థలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపణ చేసిన సూసైడ్ నోట్ ఉండటం ఆందోళన కలిగించింది.

ఆరోగ్య నేపథ్యం
ఆరోగ్య పరీక్షల ప్రకారం, ఆనందు OCD (Obsessive Compulsive Disorder) సమస్యతో బాధపడుతున్నాడు.2019లో జరిగిన బైక్ ప్రమాదంలో తండ్రి మరణం తర్వాత అతను దీర్ఘకాలిక చికిత్సలో ఉన్నాడు.

కుటుంబ నేపథ్యం
ఆనంద్ సోదరి అంజిత అజి, బెంగళూరులో ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసి, ప్రస్తుతం ఎర్నాకుళంలో బొటిక్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది.ఆమెకు ఎరట్టుపెట్ట ప్రాంతానికి చెందిన ముస్లిం యువకుడు అంజిల్ బషీర్ తోవివాహం జరిగింది.కుటుంబం ఈ వివాహానికి అంగీకరించకపోయినా, ఆనందు అజి తన సోదరికి మద్దతిచ్చాడు.ఇదే విధంగా, తన బంధువులో ఒకరి మతాంతర వివాహానికి కూడా అతను సహకరించాడు.

Rssపై ఆరోపణలు – వాస్తవాలు
ఆనందు అజి మరణంలో RSS పాత్ర లేదు. అతను గత 7–8 ఏళ్లుగా సంఘ్ కార్యకలాపాల్లో పాల్గొనలేదు. అతను “NB” పేరుతో పేర్కొన్న వ్యక్తి RSS‌లో లేరు.ఆనంద్ తండ్రి మాత్రం సంఘ్‌కు గౌరవనీయ సేవలు అందించారు.కుటుంబ సభ్యులు కూడ RSS‌పై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. శిబిరాల్లో ఏదైనా జరిగినట్లయితే, ఈ 8 ఏళ్లలో అతడు ఎప్పుడూ ప్రస్తావించలేదు. మరణం తర్వాత అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన పోస్ట్‌పై నిజ నిర్ధారణ అవసరం ఉందని భావిస్తున్నారు. కుటుంబం చట్టపరమైన చర్యలు అవసరం లేదని స్పష్టం చేసింది.కానీ వామపక్ష అనుబంధ సంస్థ DYFI వజూర్ బ్లాక్ సెక్రటరీ గౌతం బాలచంద్రన్, ఈ ఘటనపై పోలీసులకు దర్యాప్తు కోసం ఫిర్యాదు చేశారు. వామపక్ష భావజాలంతో పనిచేస్తున్న కేరళలో రిపోర్టర్ టీవీ మాత్రం ఉద్దేశ్య పూరకంగా దీనికి ఎక్కువ ప్రచార కల్పిస్తోంది.

సమగ్ర దర్యాప్తుకు సంఘ్ డిమాండ్ :
మరోవైపు ఆనందు అజి అసహజ మరణంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఓ ప్రకటన ద్వారా స్ప్ందించింది. ఈ అసహజ మరణం చాలా విచారకరమని, దురదృష్టకరమని పేర్కొంది. అనేక సంవత్సరాలుగా ఆయన కుటుంబం సంఘ్ తో అనుంబంధం పెంచుకుందని తెలిపింది.

ఆనందు తండ్రి దివంగత అజి సంఘ కార్యకర్త. ఈ విచారకరమైన సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలబడతామని సంఘ్ ప్రకటించింది. అలాగే ఆనందు అజి ఆత్మకు శాంతి చేకూరాలని ఈశ్వరుడ్ని ప్రార్థించింది.

మరోవైపు ఆనందు అసహజ మరణానికి దారి తీసిన పరిస్థితులతో పాటు సోషల్ మీడియాలో కనిపించిన సూసైట్ నోట్ పై కూడా సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కొట్టాయం శాఖ డిమాండ్ చేసింది.అందులో సంఘ్ పై కొన్ని నిరాధారమైన, సందేహాస్పదమైన ఆరోపణలు వున్నాయని, అవే తన ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నాడని గుర్తు చేసింది.దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి, సంఘ్ నిర్దోశిత్వాన్ని బయటకు తీసిన వారవుతారని ఆరెస్సెస్ అభిప్రాయపడింది.