News

దీపావళిని అధికారిక సెలవు దినంగా ప్రకటించిన కాలిఫోర్నియా

happy deepavali, elegant shiny diwali festival design. happy diwali indian deepavali, hindu festival. Indian festival
20views

భారతీయ పండుగల్లో అత్యంత ముఖ్యమైన దీపావళికి అంతర్జాతీయంగా మరో విశిష్ట గౌరవం లభించింది. ఈ పండుగ భారతదేశంతో పాటు విదేశాల్లోనూ విశేష ప్రాచుర్యం పొందింది.

దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం దీనిని అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

గతంలో అమెరికా కాంగ్రెస్‌లో దీపావళిని సెలవు దినంగా గుర్తించాలని బిల్లు ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఆ ప్రక్రియ కొనసాగింపుగా, కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై గవర్నర్ న్యూసమ్ సంతకం చేశారు.

భారతీయ అమెరికన్లకు గుర్తింపు
ఈ బిల్లును అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్రా ప్రవేశపెట్టారు. దీపావళి పండుగను అధికారిక సెలవుగా ప్రకటించడం ద్వారా కాలిఫోర్నియాలో నివసిస్తున్న లక్షలాది భారతీయ అమెరికన్లకు ఇది గౌరవ సూచకమని ఆయన అన్నారు. ఈ పండుగ సద్భావన, శాంతి, సమైక్యత అనే విలువల సందేశంతో సమాజాన్ని ఏకం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అమల్లో
కాలిఫోర్నియా కంటే ముందు పెన్సిల్వేనియా, న్యూయార్క్ రాష్ట్రాలు దీపావళిని అధికారిక సెలవుగా గుర్తించాయి. ఈ నేపథ్యంలో భారతీయుల పండుగకు గుర్తింపు ఇచ్చిన మూడవ అమెరికన్ రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది.