News

50 దేశాలలో పైగా ‘‘రాంలీలా నాటకం’’ ఆన్ లైన్ వీక్షణ

0views

అయోధ్య నగరం ప్రపంచంలో మరో సారి తనదైన ముద్రను వేసింది. ఇంతటి డిజిటల్ యుగంలో మన దేశ సరిహద్దులు దాటి రాంలీలా నాటకం ఓ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంగా పరిణామం చెందింది. ఈ యేడాది రాంలీలా నాటకం సుమారు 50 కి పైగా దేశాల్లో ఆన్ లైన్ లో ప్రసారం అయ్యింది. సుమారు 62 కోట్ల మంది దీనిని వీక్షించారు.ఢిల్లీ, ముంబై నుంచి సుమారు 250 మందికి పైగా కళాకారులు ఇందుకు దోహదపడ్డారు. త్రీడీ టెక్నాలజీతో పాటు సాంకేతికత వినియోగం, ఆధునికరమైన అలంకరణ, ఆధ్యాత్మికత ఇవన్నీ రాంలీలా నాటకం విశ్వవ్యాప్తం అవడానికి కారకాలుగా మారాయి. కేవలం నాటకంగానే కాకుండా థియేటర్లలో కూడా వేయబడింది.

వీలైనంత ఎక్కువ మందికి రాంలీలా నాటకం చేరుకోవడానికి యూపీ ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నాలే చేసింది. ఈ ప్రత్యక్ష ప్రసారం కోసం 10 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ‘‘ఆరాధన’’ పేరుతో ప్రసారమైన ఈ కార్యక్రమం టాటా ప్లే, షెమారూ మీ, VI యాప్, ఎయిర్‌టెల్, షెమారూ భక్తి యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్ పేజీలు మరియు ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.షెమరూ భక్తి యూట్యూబ్ ఛానెల్‌లోనే ఎనిమిది కోట్లకు పైగా ప్రజలు దీనిని వీక్షించారు.

COVID-19 మహమ్మారి సమయంలో ప్రారంభమైన అయోధ్య డిజిటల్ రాంలీలా, ప్రతి సంవత్సరం కొత్త వీక్షకుల రికార్డులను నెలకొల్పింది. Google డేటా ప్రకారం:

2020: 16 కోట్ల వీక్షకులు
2021: 20 కోట్ల వీక్షకులు
2022: 25 కోట్ల వీక్షకులు
2023: 40కోట్ల వీక్షకులు
2024: 41కోట్ల వీక్షకులు
2025: 62 కోట్ల వీక్షకులు

ఇంతలా విజయవంతం కావడానికి యూపీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. 2020లో రామ్‌లీలా ప్రారంభమైనప్పుడు, అప్పటి పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి నీలకాంత్ తివారీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి మార్గం సుగమం చేశారు.

రాంలీలా సమితి వ్యవస్థాపకులు సుభాష్ మాలిక్ మరియు శుభం మాలిక్ ఈ కార్యక్రమాన్ని డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మార్చారు.రామనగరి అయోధ్యలో ప్రదర్శించబడిన రాంలీలా భారతదేశం, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, వియత్నాం, చైనా, జపాన్, దక్షిణ కొరియా, మంగోలియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ UAE, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, మారిషస్, ఫిజి, ట్రినిడాడ్ మరియు టొబాగో, కెన్యా, నైజీరియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, రష్యా, కెనడా, యునైటెడ్ స్టేట్స్ మరియు బ్రెజిల్ లాంటి దేశాల్లో దీనిని వీక్షించారు.

అయోధ్యలోని రామ్లీలా శ్రీరాముని కథ కేవలం ఒక మతపరమైన ఆచారం కాదని, ప్రపంచాన్ని కలిపే సాంస్కృతిక వారధి అని దీంతో నిరూపితమైంది.యోగి ప్రభుత్వం మరియు డిజిటల్ టెక్నాలజీ మధ్య సహకారం రాంలీలాను ప్రపంచ వేదికకు చేర్చింది, భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తమైంది.