News

క్రైస్తవులే లేని గ్రామంలో అతిపెద్ద చర్చి నిర్మాణం

42views

గురుగ్రామ్‌లోని టిక్లి గ్రామంలో అసలు క్రైస్తవులు ఎవరూ లేరు, కానీ అక్కడ 10 బిఘాల చర్చి నిర్మాణలో ఉంది. ..అసలు క్రైస్తవులే లేని ప్రాంతంలో చర్చిని నిర్మించడం ఏంటని, దీన్న ఎవరికోసం నిర్మిస్తున్నారంటూ ఆ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు.

గైరత్‌పూర్–బాన్స్ రోడ్డు వెంబడి ఆరావళి పర్వత ప్రాంతంలో ఉన్న టిక్లిలో 10,000 పైగా హిందూ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరిలో ఎక్కువ మంది యాదవ సమాజానికి చెందినవారు. ఇక్కడ ఒక్క క్రైస్తవ కుటుంబం లేదు, ఇంకా చెప్పాలంటే చుట్టుపక్కల ఊర్లలో ఉన్న దాదాపు పది గ్రామాల్లో, క్రైస్తవ జనాభా ఒక శాతం కంటే తక్కువ. అలాంటి ప్రాంతంలో అతిపెద్ద చర్చి నిర్మాణం జరుగుతుంది. దీంతో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా చర్చి ఎందుకు నిర్మిస్తున్నారంటూ ఆందోళన చేస్తున్నారు.

తమ గ్రామాల్లోని ప్రజలను మతం మార్చాలనే ఉద్దేశంతోనే ఈ చర్చిని నిర్మిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాక ఈ చర్చి నిర్మాణం కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తూ వ్యవసాయ భూమిలో నిర్మాణం జరుగుతోందని కూడా వారు ఆరోపిస్తున్నారు.

ఆ స్థలంలో సంవత్సరాల క్రితం ఒక క్రైస్తవ పాఠశాల స్థాపించబడింది. ఆ సమయంలో హిందువుల పవిత్ర దారాలను ధరించిన ఓ హందూ పిల్లవాన్ని వాటిని తొలగించాలని క్రైస్తవ పాఠశాలలో చెప్పారు. అంతేకాకుండా కాలవా దారాలు ధరించిన హిందూ పిల్లలను వాటిని తొలగించమని అడిగారని, అంతేకాక అక్కడ బైబిల్ ను బోదిస్తున్నారు. ఇక ఇప్పుడు, పాఠశాల మైదానాన్ని చర్చి నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు.

ఆరేళ్ల క్రితం చర్చి కమిటీ ఈ భూమిని పాఠశాలకోసం, పిల్లల ఆటస్థలం కోసం వినియోగిస్తామంటూ మాయమాటలు చెప్ప రణధీర్ యాదవ్ అనే అతని దగ్గర భూమిని తీసుకుంది. ఇప్పుడేమో చర్చిని నిర్మిస్తోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామస్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ అక్కడ చర్చి కమిటీ దీనిపై ఏమీ స్పందించడం లేదు, తన పని తాను చేసుకుంటూ పోతుంది.

ఇక ఈ టిక్లి గ్రామం లో పదివేల జనాభా ఉంది. ఇది అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గమైన బాద్షాపూర్ పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గంలో 3.5 లక్షల మంది నివసిస్తున్నారు. ఇఫ్పుడు ఈ ప్రాంతంలో ఇలాంటి అతిపెద్ద చర్చి నిర్మాణం అనేది ఖచ్చితంగా మతమార్పిడుల కోసమే అని అక్కడి స్థానికులు చెబుతున్నారు.