News

దేశసేయే పరమావధిగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్..

70views

లోకాలను రక్షించి కాపాడేది ఆ జగన్మాత అయిన విజయ దుర్గ దేవి.. విజయదశమి నాడు పనులు ప్రారంభిస్తే అపజయం దరిచేరదని, విజయం వరిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ – ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత సేవా భారతి సంయోజక్ కేశవయ్య అన్నారు.

ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమై నేటికి 100 సంవత్సరాలు పూర్తయిందని చెప్పారు. శతాబ్ది కాలంలో ఆర్ఎస్ఎస్ సాధించిన విజయాల సందర్భంగా కడప జిల్లా చింతకొమ్మదిన్నె ఖండలోని చింతకొమ్మదిన్నె సంఘం మండలం శివాలయంలో జరిగిన విజయదశమి ఉత్సవానికి ఘనవేష్ ధరించి 105 మంది స్వయం సేవకులు పాల్గొనీ ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథి డాక్టర్ కుళాయి సాగర్ రెడ్డి, సంఘ మండల ప్రముఖు నాగమల్లారెడ్డి, ప్రధాన వక్త కేశవయ్య, స్వయం సేవకులు ఆయుధ పూజ చేశారు.

ఈ సందర్భంగా కేశవ జి మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశ సేవ తమ పర మావధిగా భావిస్తుందని అన్నారు. ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమై నేటికి 100 సంవత్సరాలు పూర్తయిందని చెప్పారు. 100 సంవత్సరాలలో ఆర్ఎస్ఎస్ సాధించిన విజయాలను వివరించారు. 1977లో దివిసీమ ఉప్పెనలో స్వయం సేవకులు సేవా చేశారని, మృత దేహాలకు సంస్కారాలు చేశారని గుర్తు చేశారు. విపత్తుల సమయంలో బాధితులకు సేవలు చేశారని చెప్పారు. అయోధ్య రామాలయం నిర్మాణంలో స్వయం సేవకుల పాత్ర గురించి వివరించారు. ఆర్ఎస్ఎస్ తన అనుబంధ సంఘాల ద్వారా వంద సంవత్సరాల దేశసేవ చేసిందని చెప్పారు. 42 సంఘ్ పరివార సంస్థలు పనిచేస్తున్నాయని అన్నారు. ఆర్ఎస్ఎస్ తన సైదాంతిక విశ్వాసాలను వ్యాప్తి చేయడానికి విద్యార్థి విభాగంలో ఏబీవీపీ, కార్మిక రంగంలో బిఎంఎస్, విద్యారంగంలో విద్యా భారతి, రైతు విభాగంలో భారతీయ కిసాన్ సంగ్, ఉపాధ్యాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం, గిరిజనుల కోసం వనవాసి కళ్యాణక్షేత్రం, ధార్మిక రంగంలో విశ్వహిందూ పరిషత్, సేవికా సమితి వంటి సంస్థలు చేస్తున్న పనితీరు గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఆర్ఎస్ఎస్ విస్తరించి సేవ కార్యక్రమాలు చేస్తుందని వెల్లడించారు.

కార్యక్రమంలో డా. కుళాయి సాగర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పగడాల బాలకృష్ణ, జిల్లా ప్రచార ప్రముఖ్ ఆర్. మురళీమోహన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, జయదేవ్, శ్రీనివాస్, సునీల్, రామ్మోహన్, నాగ మల్లారెడ్డి, బిజెపి నాయకులు చంద్రమోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, సుదర్శన్, మహేశ్వర్ రెడ్డి, పార్థసారథి 105 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు.