News

వేదాలు.. భారతీయ సంస్కృతి మూలాలు

17views

వేదాలు భారతీయ సంస్కృతికి మూలా లని దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన వేద సభలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వేదపండితులను సత్కరించారు. ఘనపాటికి రూ.6 వేలు, క్రమ పాటికి రూ.5 వేలు, ఇతర వేదపండితులకు రూ.4 వేలు చొప్పున 450 మందికి పారితోషికాన్ని అందజేశారు. ఈసందర్భంగా చతుర్వేద పండితులు జగన్మాత దుర్గమ్మను కీర్తిస్తూ చతుర్వేద పఠనం చేశారు.

అనంతరం చైర్మన్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. 50 ఏళ్లుగా వేద పండితులను దసరా ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపై సత్కరించడం స్ఫూర్తిదాయకమని తెలి పారు. దుర్గగుడి ఈవో శీనానాయక్ మాట్లాడుతూ.. చతుర్వేద పండి తుల వేద పఠనంతో ఇంద్రకీలాద్రి దశాబ్దాలుగా తరించిందన్నారు. గత ఏడాది కంటే 50 మంది పండితులకు అదనంగా ఈ ఏడాది సత్కరించా మని చెప్పారు. కార్యక్రమంలో కాణిపాకం ఈవో కిషోర్, వేద పండితులు ఆంజనేయ ఘనపాటి, షణ్ముఖ శాస్త్రి, శ్రీనివాస శాస్త్రి పాల్గొన్నారు