
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో పాటుగా, దేశానికి చెందిన వివిధ స్వాతంత్య్ర సమయోధుల జీవిత చరిత్రలు వంటి అంశాలపై ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధనలు జరగనున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాష్ట్రీయ నీతి అనే కొత్త విద్యాకార్యక్రమం ద్వారా ఈ బోధనలు అందించనున్నట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ తెలిపారు. దీనికి సంబంధించిన మాన్యువల్‌ను ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖగుప్తా ఆవిష్కరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సిలబస్‌ను పరిశీలిస్తున్నారు. అక్టోబర్ లేదా నవంబర్ రెండవ వారం నాటికి సిలబస్ ఏంటి అనేది తెలుస్తుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా అన్‌సంగ్ హీరోస్ అనే ప్రత్యేక విభాగంలో వీరసావర్కర్, శ్యామప్రసాద్ ముఖర్జీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకుల పాఠాలతో పాటుగా 1925లో డాక్టర్జీ స్థాపించిన ఆర్‌ఎస్‌ఎస్, సిలబస్‌లో కీలక భాగంగా ఉంటుంది. దాని మూలాలు, భావజాలం, సాంస్కృతిక పాత్ర చ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం, అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో వారి పనిని కూడా ఈ పాఠ్యాంశంలో భాగంగా చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఉపాధ్యాయ హ్యాండ్ బుక్స్ తయారు చేసి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలికి పంపించారని అధికారులు తెలిపారు.