News

“పాకిస్తాన్ వెళ్లిపో”.. బంగ్లాదేశ్ యూనస్‌కు చేదు అనుభవం.

0views

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. 2024లో బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి, భారత్ పారిపోయి వచ్చింది. ఈ పరిణామాల తర్వాత యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నియమితులయ్యారు. అయితే, ఆయన నియామకం తర్వాత మైనారిటీలు , ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు.

అయితే, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన మహ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా ప్రవాస బంగ్లాదేశీయలు ఆందోళన చేపట్టారు. ‘‘యూనస్ బంగ్లాదేశీ, యూనస్ పాకిస్తాన్ వెళ్లిపో’’ అని ప్రదర్శనకారులు గూమిగూడి నినాదాలు చేశారు. యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌లో భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని, హిందువులు, మైనారిటీలపై హింస పెరిగిందని, చాలా మంది దేశం విడిచి పారిపోవాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌ను యూనస్ తాలిబాన్ దేశంగా, ఉగ్రవాద దేశంగా మారుస్తున్నారని నిరసనకారులు మండిపడ్డారు. చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసిన హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణదాస్‌ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.