
149views
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సక్షమ్ నెల్లూరు శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగ ఉపాధ్యాయుల సన్మాన సభను నెల్లూరు శివాజీ సెంటర్ లో ఉన్న టీవీఎస్ కళ్యాణ్ సదన్ సెప్టెంబరు 7న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 51మంది టీచర్లను సన్మానించారు. ముఖ్య వక్త విఆర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీ అశోక్ రావు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచి దేశం పట్ల ప్రేమ, గౌరవం, ధర్మం పట్ల, సంస్కృతి పట్ల మంచి అవగాహన కల్పించాలని, వారిని మంచి పౌరులుగా దేశభక్తులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ముఖ్య అతిథులుగా విక్రమ సింహపురి వర్సిటీ ప్రొఫెసర్ శ్రీ భగవాన్, ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవా ప్రముఖ్ శ్రీ మల్లికార్జున్ రెడ్డి, దర్గామిట్టా హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జ్యోతిర్మయి, శ్రీ వెంకట్రావు, ఆపస్ ఉపాధ్యాయ సంఘ పెద్దలు పాల్గొన్నారు.





