News

దీన దయాళ్ పురం గ్రామంలో శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయజీ జయంతి

202views

కృష్ణాజిల్లాలోని దివిసీమలోని దీన దయాళ్ పురం గ్రామంలో పండిట్ శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయజీ 109 వ జయంతి ఉత్సవంను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొనటం జరిగింది. ఈ సందర్భంగా స్వర్గీయ శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయ జీ దేశానికి, హిందూ సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.. ఆ మహానుభావుని పేరుతొ నిర్మించిన గ్రామంలో నివసిస్తున్నందుకు అక్కడి గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.