
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న దసరా వేడుకలకు ఈసారి సాంకేతికత పరవళ్లు తొక్కనుంది. ఏఐ కెమెరాలు, డ్రోన్‌లు, చిన్నారులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) చేతి బ్యాండ్‌లు.. ఇలా సాంకేతికతను వినియోగించనున్నారు. తాజాగా ఉత్సవాల సమాచారం, సేవల గురించి మొబైల్ యాప్, చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. బీ దసరా 2025 పేరుతో ప్లేస్టోర్, యాప్ స్టోర్‌లో యాప్ ఉంది. భక్తులకు అవసరమైన అన్ని సేవలు అందులో ఉంచారు. సేవలు ఏ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి.. అక్కడికి ఎలా చేరుకోవాలో దిశానిర్దేశం కూడా చేస్తుంది.
చాట్‌బాట్‌లోనూ సమగ్రంగా..
చాట్‌బాట్ సేవలను 94418 20717 నంబరుతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఐ ఆధారిత సంభాషణ వేదికగా రూపొందించారు. ఈ నంబర్‌ను మొబైల్‌లో సేవ్ చేసుకుని.. వాట్సాప్‌లో.. అమ్మ లేదంటే హాయ్ అనే మెసేజ్ చేయాలి
వాట్సాప్‌లో మెసేజ్ చేయగానే.. తెలుగు, ఆంగ్లం.. ఏ భాషలో సమాచారం కావాలని అడుగుతుంది. తర్వాత.. మెయిన్ మెనూ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని టచ్ చేస్తే.. వరుసగా దర్శనం, విరాళాలు, గ్రీవెన్స్, సదుపాయాలు, సేవలు, పండగలు.. ఇలా ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో దేనిపై టిక్ చేసే.. ఆ వివరాల మొత్తం మెసేజ్ రూపంలో వస్తాయి. యాప్‌లో సేవలన్నీ చాట్‌బాట్‌లోనూ ఉంచారు.
సమాచారం ఇలా..