News

పురాణ ఘట్టం.. పురస్కారాల పట్టం

210views

హస్తకళలకు కాణాచిగా శ్రీకాళహస్తి అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. ప్రకృతిలో లభించే సహజ రంగులతో వస్త్రాలపై వేసే హస్తకళ ఇక్కడి కలంకారీ కళాకారుల సొంతం. వారసత్వ సంపదగా వస్తున్న ఈ కళ స్థానిక కళాకారులతో పాటు ఈ ప్రాంతానికి ఘనకీర్తిని తెస్తోంది. కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తున్నా ఇప్పటికీ సంస్కృతి, సంప్రదాయాలను మేళవించే అలనాటి పురాణ ఘట్టాలతో కళాకారులు తమదైన నైపుణ్యంతో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకోగలిగారు. కలంకారీ కళాకారుడైన జొన్నలగడ్డ గుర్రప్పశెట్టి పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకోగా, దాదాపు పదిహేను మందికిపైగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఇవన్నీ రామాయణ, మహాభారత ఘట్టాలు, శ్రీకృష్ణలీలామృతం, తెలుగుభాష వైభవం తదితర వాటికి వచ్చినవే.