News

ముఖ్యమంత్రికి ఎండోమెంట్ చట్ట సవరణ డ్రాఫ్ట్ అందజేత

215views

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విశ్వ హిందూ పరిషత్ – VHP కేంద్రీయ సంఘటనా కార్యదర్శి శ్రీ మిలింద్ పరాండే జీ, కేంద్రీయ ఉపాధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు, భాగ్యనగర క్షేత్ర కార్యదర్శి శ్రీ రవికుమార్, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీవెంకటేశ్వర్లు, కార్యదర్శి శ్రీ సుబ్బరాజు, కోశాధ్యక్షులు శ్రీ దుర్గాప్రసాదరాజు, సంఘటనా కార్యదర్శి శ్రీ శ్రీనివాసరెడ్డి కలిశారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ ఎండోమెంట్ చట్టాన్ని సవరణ కోరుతూ నమూనా డ్రాఫ్ట్ ను వారికి అందించగా దానిని పరిశీలిస్తానని సానుకూలంగా స్పందించారు. చట్ట సవరణ జరిగేలోగా కొన్ని ముఖ్య నిర్ణయాలు మనం హైందవ శంఖారావంలో మనం సూచించిన చర్యలు తీసుకోమనివారిని కోరడం జరిగింది. దేవాలయాలకు డొమెస్టిక్ కరెంటు బిల్లులు ఇవ్వాలి అని కూడా కోరినాము. ఇదే విషయంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ మాధవ్ గారిని కూడా కలిసి చట్ట సవరణకు సహకరించమని కోరారు.