News

వినాయక నిమజ్జనంలో హిందువులపై సిఐ శ్రీనివాసులు దౌర్జన్యం..

174views

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో గత నెల 29 వ తేదీన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణ సీఐ శ్రీనివాసులు అత్యంత అసహనంగా దౌర్జన్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై విశ్వ హిందూ పరిషత్ నిరసన వ్యక్తం చేసింది. వినాయక విగ్రహాలు ఊరేగింపుగా వస్తుంటే సోమప్ప సర్కిల్లో సీఐ మైకు తీసుకొని బహిరంగంగా “వెధవల్లారా “అని హిందువులను తిట్టారు..అంతేకాకుండా అదే రోజు రాత్రి ఒంటిగంట సమయంలో ఫైర్ స్టేషన్ వద్ద ఒకరిని సీఐ విచక్షణా రహితంగా కొట్టాడు. ఇక 31వ తేదీన సోగనూరు రోడ్డు ఆంజనేయ స్వామి గుడి వినాయకుడు ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీగా ఊరేగింపుగా రామస్వామి గుడి వద్దకు రాగా సీఐ తన సిబ్బందితో వచ్చి ఆటో డ్రైవర్ని బూతులు తిడుతూ. బూటు కాళ్లతో విచక్షణ రహితంగా తన్ని గాయపరిచారు.. హిందూ సమాజం ఈ ఘటనపై ఆగ్రహావేశాలకు లోనయ్యింది.

సీఐ బూటు కాళ్ళతో తన్నుతూ చేసిన దౌర్జన్యాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. ప్రశాంతంగా జరుగుతున్న ఊరేగింపులో, సీఐ అసహనానికి లోనై దౌర్జన్యం చేశారని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. సిఐ శ్రీనివాసుల పై జిల్లా ఉన్నతాధికారులు సుమోటో కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ సంఘటనల్లో బాధపడిన హిందువులకి విశ్వహిందూ పరిషత్ సంఘీభావం తెలుపుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సీఐ పై చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా విశ్వహిందూ పరిషత్ తెలిపింది. లేకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయని వీహెచ్పీ ఈ సందర్భంగా చెప్పింది.